Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీపై బీజేపీ స్టాండ్ మారుతుందా ? అమిత్ షా కరుణించబోతున్నారా ? నారాయణ సలహా ఇదే..

ఏపీలో రెండేళ్ల క్రితం అధికార వైసీపీతో అనధికారికంగా జట్టు కట్టిన కేంద్రంలోని బీజేపీ సీఎం జగన్ ను తమ రాజకీయ అవసరాల కోసం ఇష్టానుసారంగా వాడుకుంటోంది. అయినా ఏపీకి జరిగిన మేలూ లేదు. పైపెచ్చు కోతలు, వాతల రూపంలో వైసీపీ సర్కార్ కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో విపక్ష టీడీపీ .. బీజేపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు కోరినా సాధ్యం కాలేదు. దీంతో ఇక బాబు ప్రయత్నాలకు గండి పడినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

బీజేపీతో చంద్రబాబు అడుగులు

బీజేపీతో చంద్రబాబు అడుగులు


కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు కాషాయ పార్టీ గుర్తుకొస్తుంటుంది. గతంలో వాజ్ పేయ్ హయాంలో ఓసారి ఎన్డీయేతో జట్టు కట్టిన చంద్రబాబు.. అవసరం లేకపోయినా గుజరాత్ లో మోడీ సర్కార్ పై విమర్శలు చేసి అభాసుపాలయ్యారు. ఆ తర్వాత ఎన్డీయేకు రాంరాం చెప్పి తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టారు. తిరిగి 2014లో మోడీ నేతృత్వంలోని ఎన్డీయేవైపు గాలి వీస్తుందని తెలియగానే వెంటనే ఢిల్లీ వెళ్లి తిరిగి ఎన్డీయేతో జత కట్టేశారు. గతంలో తాను అన్న వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దంటూ మోడీకి చెప్పారు. దీంతో మరోసారి టీడీపీ-బీజేపీ పొత్తు చిగురించింది తిరిగి ఇద్దరూ కలిసి అధికారంలోకి వచ్చి అధికారం పంచుకున్నాక వైసీపీ ఒత్తిడికి తలొగ్గి ఎన్డీయేకు గుడ్ బై చెప్పేశారు. ఈసారి అంతే.. గుడ్ బై చెప్పేసి వదిలేస్తే పోయే దానికి ధర్మపోరాటం పేరుతో బీజేపీని, మోడీని, అమిత్ షాను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ-బీజేపీ మధ్య అంతులేని అగాధం పెరిగిపోయింది. చివరకు అది చంద్రబాబు కొంపే ముంచింది. కేంద్రంలో ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీజేపీ ఎంచక్కా రెండోసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చేసింది.

బీజేపీ తోడు లేకే ఓడిపోయినట్లుగా...

బీజేపీ తోడు లేకే ఓడిపోయినట్లుగా...

2019 ఎన్నికల్లో బీజేపీపై ధర్మపోరాటం చేసి ఓటమిపాలైన చంద్రబాబుకు మరోసారి జ్ఞానోదయమైంది. కేంద్రంలోని ఎన్డీయే మద్దతు లేకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టమేనన్న అంచనాకు ఆయన వచ్చేశారు. దీంతో మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికల తర్వాత మొదలైన ఈ ప్రయత్నాలు ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో చంద్రబాబును బీజేపీ మరోసారి కరుణిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఇప్పటివరకైతే అటు ప్రధాని మోడీ కానీ, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ చంద్రబాబుకు అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ చంద్రబాబుకు మరోసారి నిరాశ తప్పలేదు.

చంద్రబాబుకు దొరకని అమిత్ షా

చంద్రబాబుకు దొరకని అమిత్ షా


పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులకు దిగడంతో దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో అపాయింట్ మెంట్ కూడా కోరారు. అదే సమయంలో అమిత్ షా కశ్మీర్ లో ఉగ్రవాద దాడులపై సమీక్ష కోసం శ్రీనగర్ వెళ్లి అక్కడే మూడు రోజులు ఉండిపోయారు. దీంతో చంద్రబాబుకు ఆయన అపాయింట్ మెంట్ లభించడం లేదని అర్ధమైపోయింది. అమిత్ షా అపాయింట్ మెంట్ లేకుండా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరకదనే విషయం చంద్రబాబుకు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దీంతో చంద్రబాబు అమిత్ షాను కలవకుండానే తిరిగొచ్చారు.

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్

చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు తాను అక్కడ లేకపోవడంతో ఆ తర్వాత అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. కశ్మిర్ టూర్ లో ఉన్నందున కలవలేకపోయినట్లు తిరిగొచ్చాక మరోసారి కలుద్దామని చెప్పినట్లు టీడీపీ వర్గాలు చెప్పాయి. అయితే అదంటా ఒట్టిదేనంటూ వైసీపీ విమర్శలకు దిగడంతో మరో దుమారం రేగింది. కానీ టీడీపీ వర్గాలు మాత్రం ఎక్కడా వెనక్కితగ్గలేదు. దీంతో వైసీపీ నాలుగు విమర్శలు చేసి ఊరుకుంది. అటు బీజేపీ నుంచి కూడా ఎలాంటి ప్రతిస్పందనా లేకపోవడంతో చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసే ఉంటారన్న చర్చ మొదలైంది.

అమిత్ షాను కలిసిన ఎంపీ కనకమేడల

అమిత్ షాను కలిసిన ఎంపీ కనకమేడల

ఢిల్లీ టూర్ లో చంద్రబాబుకు అమిత్ షా అపాయిుంట్ మెంట్ దొరక్కపోవడం, ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబుకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీ కనకమేడల హల్ చల్ చేశారు. అమిత్ షా ఓ సమావేశంలో పాల్గొని వెళ్తున్న సందర్భంలో రెండు నిమిషాల పాటు ఆయన్ను పలకరించి మాట్లాడారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ ను ప్రస్తావించారు. దీంతో త్వరలో కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు. దీంతో టీడీపీలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇవాళ కాకపోతే రేపు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకడం ఖాయమన్న అంచనాలో టీడీపీ నేతలుున్నారు.

 బీజీపీ మౌనంతో టీడీపీ హ్యాపీ

బీజీపీ మౌనంతో టీడీపీ హ్యాపీ

అమిత్ షాతో అపాయిుంట్ మెంట్ కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ మాత్రం మౌనంగా ఉంటోంది. గతంలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత కానీ, ఆ పార్టీ నేతలు కానీ ప్రయత్నాలు చేసిన సందర్భంలో కాషాయ నేతలు వారిపై విరుచుకుపడేవారు. చంద్రబాబుతో కలిసేది లేదని, గతంలో తమపై ధర్మపోరాటం పేరుతో హంగామా చేసి దెబ్బతిన్న వైనాన్ని గుర్తు చేసేవారు. కానీ ఈసారి మాత్రం బీజేపీ నేతలు ఆ స్ధాయిలో స్పందించడం లేదు. అలాగే అమిత్ షా చంద్రబాబుు ఫోన్ చేసి ఘటనపై కానీ, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అమిత్ షాతో మాట్లాడిన అంశంపై కానీ బీజేపీ నేతలు నోరుమెదపడం లేదు. దీంతో అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్న చర్చ జరుగుతోంది. అంతిమంగా తాజా పరిణామాలపై టీడీపీ మాత్రం హ్యాపీగా ఉంది.

 చంద్రబాబుకు నారాయణ సలహా

చంద్రబాబుకు నారాయణ సలహా

కలిసివచ్చే భావసారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకుంటామంటూ తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావసారూప్య పార్టీలంటే బీజేపీనా, బీజేపీయేతర పార్టీలా అంటూ ఆయన్ను ప్రశ్నించారు. అంతే కాదు కేంద్రంలోని బీజేపీతో కలిస్తేనే అధికారంలోకి వస్తామన్నది చంద్రబాబు భ్రమ మాత్రమేనని నారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు బీజేపీపై తన భ్రమలు తొలగించుకుంటే మంచిదని నారాయణ సలహా ఇచ్చారు. తద్వారా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేవి కావని నారాయణ చెప్పినట్లయింది. గతంలో కమ్యూనిస్టులతో ఓసారి, బీజేపీతో ఓసారి కేంద్రంలో జత కట్టి అధికారాన్ని పంచుకున్న చరిత్ర టీడీపీకి ఉండటమే నారాయణ వ్యాఖ్యల వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+