షర్మిల కాంగ్రెస్ లోకి ఖాయం, విజయమ్మ ఏపీలో - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!

వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలవటానికి సిద్దమయ్యారు. తన పార్టీ విలీనం చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ రోజు లేదా రేపు షర్మిల ఢిల్లీలో రాహుల్ తో సమావేశం కానున్నారు. ఇదే సమయంలో షర్మిలను ఏపీ లోనూ పార్టీ ఎదుగదల కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్ ముఖ్య నేతల ఆలోచన. దీనికి సంబంధించి షర్మిల తన వైఖరి స్పష్టం చేయనున్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమని..ఏపీలో వైసీపీ పైన ప్రభావం పై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ తో కలిసి షర్మిల:వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ తో కలిసి రాజకీయంగా కొనసాగాలని నిర్ణయించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ స్థాపించిన షర్మిల ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఒంటరిగా పోరాటం చేయటం కంటే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

BJP Leader Adinaryana Reddy made key comments on YS Sharmila journesy with Congress, predicts work for AP

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలో షర్మిల ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత డీకే శివకుమార్ తో పలు మార్లు షర్మిల భేటీ అయ్యారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ అధినాయకత్వం - నేరుగా షర్మిలతో చర్చలు చేసారు. ఒక, ఈ రోజు లేదా రేపు షర్మిల ఢిల్లీలో రాహుల్ .. ప్రియాంకతో సమావేశం కానున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ లో రాజకీయ భవిష్యత్..బాధ్యతల పైన స్పష్టత రానుంది.

ఆదినారాయణ రెడ్డి కామెంట్స్:షర్మిల కాంగ్రెస్ లో చేరిక పైన మాజీ మంత్రి..బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత ఏపీలోనూ తిరిగేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్, విజయమ్మ,షర్మిల అందరూ కలిసి ఏపీలో తిరిగితే ఏపీలో వైసీపీ గల్లంతు అవుతుందని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీలో వైసీప ప్రభుత్వం పైన ఆరోపణలు చేసారు. కరోనా సమయంలో కేంద్రం సాయమందిస్తే..రాష్ట్రంలో ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి 35 లక్షల ఇళ్లు కేటాయిస్తే 35 వేలు మాత్రమే నిర్మించారని వివరించారు. ఏపీలో బీజేపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని...పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.

BJP Leader Adinaryana Reddy made key comments on YS Sharmila journesy with Congress, predicts work for AP

షర్మిల లక్ష్యం అదేనా:షర్మిల ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చారు. తాను తెలంగాణకే పరిమితం అవుతానని తేల్చి చెప్పారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా తనను తెలంగాణ ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన గురించి పని లేని..పస లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన భవిష్యత్ తెలంగాణతోనేనని తేల్చి చెప్పారు. తన ఆరాటం..పోరాటం తెలంగాణ కోసమేనని షర్మిల స్పష్టం చేసారు.

దీని ద్వారా ఏపీలో షర్మిల కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారనే ప్రచారానికి పరోక్షంగా ముగింపు పలికారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగానే ఉంటానని..తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని షర్మిల స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ నాయకత్వంతో చర్చల సమయంలోనే తెలంగాణకే పరిమితం అయ్యేలా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+