ఏపీలో పొత్తు చీలిపోయింది .. కూటమి నేత సంచలన కామెంట్స్
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా, జనసేన 21 స్థానాల్లో పోటీకి దిగుతోంది. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పోటీ చేస్తోంది. అయితే కూటమి పొత్తుపై మొదటి నుంచి కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అన్నీ పార్టీలోనూ పొత్తుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
40 స్థానాల్లో పోటీ చేస్తుందని భావించిన జనసేన కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వ్యవహారశైలి నచ్చని కొందరు నాయకులు జనసేన నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి కనిపించింది.ఇక టీడీపీలో కూడా ఇదే రేంజ్‌లో అసంతృప్తి వ్యక్తం అయింది.

టికెట్ ఆశించిన నేతలకు మొండిచెయి ఎదురుకావడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు. టీడీపీలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇక బీజేపీలో కూడా ఇదే ధోరణి వ్యక్తం అవుతోంది.
తాజాగా దీనిపై స్పందించారు బీజేపీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ. ఆయన ఓ మీడియా ఛానెల్లో మాట్లాడుతూ..ఈ పొత్తు వల్ల బీజేపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. ఏపీలో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు వద్దని ప్రతి కార్యకర్త కూడా సంతకాలు చేసిన లేఖను అధిష్టానానికి పంపిస్తే..దాన్ని తుంగలో తొక్కారని అంబికా కృష్ణ పేర్కొన్నారు. నిజమైన బీజేపీ నాయకులు ఎవరికీ కూడా టికెట్లు దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ బీజేపీ నాయకత్వంపై అంబికా కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు వద్దని 175 నియోజకవర్గాల్లోని కార్యకర్తలు చెప్పారని..ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. ఢిల్లీ వెళ్లిన నేతలు పొత్తుతో ఏపీకి తిరిగిచ్చారని అంబికా కృష్ణ తెలిపారు. టీడీపీ అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు సహకరించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. బీజేపీ నాయకులు వారి ఆత్మప్రబోధానుసారంగా ఓట్లు వేస్తారని బీజేపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తుపై అంబికా కృష్ణ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయ వార్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.












Click it and Unblock the Notifications