కొత్త ప్రభుత్వంలో తన పాత్రపై పవన్ కీలక నిర్ణయం..!!
ఏపీలో కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించారు. ఏపీలో ఈ నెల 9న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములు కానున్నాయి. అదే విధంగా ఏపీలో చంద్రబాబు కేబినెట్ లో బీజేపీ, జనసేనకు బెర్తులు ఖాయం అయ్యాయి. అయితే...పవన్ కు బీజేపీ ముఖ్య నేతల నుంచి కీలక ఆఫర్ వచ్చినట్లు సమాచారం. దీని పైన పవన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
పవన్ కు ఏ పదవి
ఏపీలో కూటమి అనూహ్య విజయం సాధించింది. కేంద్రంలో ప్రధాని ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి బీజేపీతో పాటుగా టీడీపీ, జనసేనకు ప్రాతినిధ్యం దక్కనుంది. కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఇప్పుడు చర్చగా మారింది. ఏపీలోనూ మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పవన్ ఏపీలోకూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగితే డిప్యూటీ సీఎం అవుతారనే ప్రచారం సాగింది. ఇప్పుడు జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు గెలిచింది. దీంతో, కొత్త ప్రభుత్వంలో మూడు మంత్రి పదవుల వరకు దక్కే అవకాశం ఉంది.

ఏం చేయబోతున్నారు
జనసేనకు స్పీకర్ తో పాటుగా రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. అదే విధంగా బీజేపీకి రెండు మంత్రి పదవులు వస్తాయని చెబుతున్నారు. ఇదే సమయంలో పవన్ కు ఇష్టమైతే కేంద్ర కేబినెట్ లో చేరాలని బీజేపీ ముఖ్య నేతల నుంచి ఆఫర్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ అంగీకరిస్తే ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చి... త్వరలో రాజ్యసభకు నామినేట్ చేసే విధంగా ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ పైన పవన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏపీ పైనే ఫోకస్
జనసేన నేతల సమాచారం మేరకు పవన్ ఏపీ రాజకీయాలకే కొంత కాలం పరిమితం కావాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నా..పవన్ ఆ విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో తన పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి..తాను జనసేన అధినేతగా పాలనా వ్యవహారాల్లో చంద్రబాబుకు చేదోడుగా నిలవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీంతో..ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్..తన భవిష్యత్ పాత్ర పైన కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications