బాబు పై దేశ ద్రోహం కేసు పెట్టాలి : చర్యలు తీసుకోకుంటే నిరసనకు దిగుతాం: బిజెపి నేతలు..!
టిడిపి అధినేత చంద్రబాబు పై దేశద్రోహం కేసు పెట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేసారు. గవర్నర్ నరసింహన్ ను కలిసిన బిజెపి నేతలు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రధాని మోదీ పైనా..వ్యవస్థల పైనా చంద్రబాబు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని..ఆయన పై చర్యలు తీసుకోకుంటే నిరసలకు దిగుతామని స్పష్టం చేసారు.
బాబు పై కేసు నమోదు చేయాలి..
టిడిపి అధినేత చంద్రబాబు పై బిజెపి నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసారు. ఆయన పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు పై చర్యలు తీసుకోకుంటే తాము నిరసనలకు దిగుతామని బిజెపి నేతలు స్పష్టం చేసారు. కర్నాటక లోని మాండ్యలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతీ రోజు వ్యవస్థల పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని..అదే విధంగా ప్రధాని మోదీ పైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు పై దేశద్రోహం కేసు నమోద చేయాలని కోరారు. ఇవియంల నిపుణుడు పేరుతో దొంగ టెక్నీషియన్ హరిప్రసాద్ ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు.

చంద్రబాబుకు ఏమైంది...
ఏపిలో ఎన్నికలు ముగిసిన తరువాత టిడిపి అధినేత చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నారని బిజెపి నేతలు ఎద్దేవా చేసారు. చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 2009 లో చంద్రబాబు ఇవియంల పైనే నెపం వేసారని గుర్తు చేసిన బిజెపి నేతలు..2014 లో ఈవిఎంలు బాగా పని చేసాయనే భావనలో ఉన్నారన్నారు.
ఇవియం నిపుణుడు అని చెబుతూ హరిప్రసాద్ మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్దం కావటం లేదన్నారు. ఈవీయంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతామని బిజెపి నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు పై చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీ నేతలు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications