బీజేపీ ఎంపీ అభ్యర్దిగా స్వామి పరిపూర్ణానంద- నియోజకవర్గం ఖరారు..!!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించకొనే దిశగా హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతోంది. అందులో భాగంగా దక్షిణాదిన ఎక్కువ సట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ, తెలంగాణలోనూ ఈ సారి లోక్ సభ అభ్యర్దుల ఫైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఎంపికలో స్వామి పరిపూర్ణానందను పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది.

పోటీకి సిద్దం : కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. హిందుత్వ అజెండాతో మత వ్యాప్తి దిశగా స్వామి పరిపూర్ణానంద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇంఛార్జ్ గా పని చేసారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెలిచినా ఓట్ల శాతం పెరిగింది. ఆ తరువాత పార్టీ విస్తరణ..ప్రచారం కొనసాగించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజాబామాద్, అదిలాబాద్ పరిధిలో చేసిన ప్రచారం..హిందుత్వ సభల ద్వారా అనూహ్యంగా బీజేపీకి మద్దతు పెరిగింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది.

BJP likely to field Swamy Paripurnananda for Loksabha form Hindupur in next Elections

హైకమాండ్ తో సత్సంబంధాలు : ఈ సారి ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బీజేపీ అభ్యర్దిగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పరిపూర్ణానంద సన్నిహితంగా ఉంటారు. తెలంగాణలో కాంగ్రెస్ 12 ఎంపీ స్థానాలు గెలుస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి సిట్టింగ్ సీట్లతో పాటుగా మల్కాజ్ గిరి, చేవెళ్ల ఖచ్చితంగా గెలవాలని బీజేపీ టార్గెట్ గా ఫిక్స్ చేసింది. దీంతో, మల్కాజ్ గిరి లేదా ఏపీలోని హిందూపూర్ స్థానాల్లో స్వామి పరిపూర్ణానంద పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

BJP likely to field Swamy Paripurnananda for Loksabha form Hindupur in next Elections

రెండు సీట్లలో పరిశీలన : హిందూపురంలో హిందూ మత ప్రచారం, వ్యాప్తిలో స్వామి పరిపూర్ణానంద కొంత కాలంగా యాక్టివ్ గా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం..దక్షిణాది రాష్ట్రాలు, భాషల్లో పట్టుుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న స్వామి పరిపూర్ణానంద కు సీటు కేటాయింపు అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో స్వామి పరిపూర్ణానంద పాల్గొంటున్నారు. ఈ వేడుక తరువాత సీట్ల కేటాయింపు గురించి బీజేపీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+