కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేశ్ రూ.30 కోట్లు..!?

ఏపీలో ఎన్నికలవేళ అనూహ్య అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా మారుతోంది. బీజేపీ తమ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొనసాగిస్తుంది. ఇదే సమయంలో కమలం పార్టీ నుంచి ఎంపీ స్థానం ఆశిస్తున్న సీఎం రమేష్ కు సంబంధించి ఆసక్తికర అంశాలు ప్రచారంలోకి వచ్చాయి.

టీడీపీ జనసేన బిజేపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. టీడీపీ మూడు జాబితాల ద్వారా 139 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. 13 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. జనసేన, బీజేపీ తమ అభ్యర్థుల జాబితా వెల్లడించాల్సి ఉంది. బీజేపీ నుంచి ఈసారి ఆరు ఎంపి స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలవనన్నారు. గతంలో టీడీపీలో కీలక నేతగా వ్యవహరించి ఆ తర్వాత బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేష్ ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్ పేరు కూటమి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సమయంలోనే సీఎం రమేష్ కు సంబంధించిన కీలక అంశాలు ప్రచారంలోకి వచ్చాయి.

BJP MP CM Ramesh donated Rs 30 crores to Congress through electoral bonds

తాజాగా వెల్లడైన ఎలక్ట్రోల్ బాండ్స్ అంశంలో సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి రూ 30 కోట్లు విరాళం ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్ తో పాటుగా సీఎం రమేష్ జనతాదాల్ సెక్యులర్ కు రూ10 కోట్లు, తెలుగుదేశం పార్టీకి రూ 5 కోట్లు ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం రమేష్‌కు సంబంధించిన ఈ అంశాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉంటూ కాంగ్రెస్‌కు విరాళాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల సీఎం జగన్ ను టార్గెట్ చేయడం, టీడీపీ నేతలు షర్మిలకు మద్దతు ఇవ్వటం పైన వైసీపీ నేతలు తరచు సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు కడప జిల్లాకే చెందిన సీఎం రమేష్ ఒకప్పటి టీడీపీ ముఖ్యనేతగా, ప్రస్తుత బీజేపీ ఎంపీగా కొనసాగుతూ కాంగ్రెస్ కు రూ 30 కోట్లు చెల్లించడం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపైన సీఎం రమేష్ ఏ రకంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+