ఎన్నికలకు ముందొకసారి.. ఇప్పుడు మళ్లొకసారి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం తప్ప ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేదని ఆయన విమర్శించారు. టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్స్‌లా ముగిసిందని ఎద్దేవా చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Botcha Satyanarayana made key remarks on TDP

ఎన్నికలకు ముందు ఒకసారి.. ఇప్పుడు మహానాడు ద్వారా మరోసారి ప్రజలను మోసం చేయడానికి టీడీపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. మహానాడు ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ఏ చెప్పిందో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సభ్యత మరిచి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు.

చివరికి రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబుపత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యా శాఖను తీసుకువెళ్ళిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్దులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు.

మహనాడు సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను ఎప్పుడు, ఏ తేదీల్లో అమలు చేస్తామో ఎందుకు చెప్పలేక పోయారు? తమ ప్రభుత్వం హాయంలో తాము ఏం చేశామో ఇప్పటికీ గట్టిగా చెప్పగలమని బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చుకున్నారని, ఎన్టీఆర్‌ జిల్లాను కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా కూటమి ప్రభుత్వం మారుస్తుందా? అని ప్రశ్నించారు.

పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా 90 మార్కులు వచ్చాయని, ఇటువంటి పరిస్థితిని ఎప్పుడైనా చూశామా? అని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. 16,000 మంది తమ పేపర్లను కరెక్షన్‌ చేయించుకుంటే దానిలో అధికశాతం అస్తవ్యస్తంగా పేపర్ల మూల్యాంకనం చేసినట్లుగా తేలిందని చెప్పారు.

పదోతరగతి విద్యార్ధుల జవాబు పత్రాలను ఎంత దారుణంగా దిద్దారనేది అర్థమౌతోందని బొత్స చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల రీవాల్యుయేషన్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఎటువంటి తప్పులు చేశారో కనీసం సమీక్ష అయినా చేసుకున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

విద్యాశాఖ అసమర్థత కారణంగా విద్యార్ధులు ఎంత క్షోభకు గురయ్యారో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా కనీసం 14 రోజులు జవాబు పత్రాలను దిద్దేవారన, కూటమి ప్రభుత్వంలో మాత్రం తొమ్మిది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశారని బొత్స అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+