ఉగాది తరువాత..: మంత్రి బొత్స సంచలనం..!!

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో కొనసాగిస్తోన్న పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిపై ఘాటు విమర్శలను సంధించారు.

వారి పర్యటనలు, పాదయాత్రలు.. ఇంకో ఆరునెలలు మాత్రమేనని బొత్స అన్నారు. ఆ తరువాత వారి ఛాప్టర్ క్లోజ్ అవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఉగాది పండగ తరువాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్.. ఇక కనిపించబోరని, హైదరాబాద్‌కే పరిమితమౌతారని అన్నారు. ఈ ఆరు నెలలు మాత్రమే వారి అరుపులు, కేకలు ఉంటాయని, వాటిని భరించక తప్పదని చెప్పారు.

Botcha Satyanarayana slams Chandrababu, Nara Lokesh and Pawan Kalyan

విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముగ్గురు ముడు దిక్కులా తిరిగుతూ తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని.. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందుకు సహనం కోల్పోతున్నారని ప్రశ్నించారు. వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తారంటూ మంత్రి బొత్స చురకలు అంటించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్‌ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలన అందస్తోందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తోందని చెప్పారు. చంద్రబాబులా దళారులను పెట్టి దోచుకోలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టింది చంద్రబాబేనని బొత్స చెప్పారు.

ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంతో అవసరమని, దీనికోసం తాము రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని బొత్స అన్నారు. హోదాకు బదులుగా ప్యాకేజీకి కేంద్రం అంగీకరించిందనే ఆనందంతో స్వీట్స్ పంచుకోలేదని చెప్పారు. ఎదుటివారు ఏమనుకుంటారనే కనీసం సిగ్గు కూడా చంద్రబాబుకు లేదంటూ మంత్రి ధ్వజమెత్తారు.

Botcha Satyanarayana slams Chandrababu, Nara Lokesh and Pawan Kalyan

చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్.. రాష్ట్రం అంతా తిరుగుతూ తమ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిపైన అసహనం ప్రదర్శిస్తున్నారని, 40 ఏళ్ల ఇండస్ర్టీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇంగితజ్ఞానం ఏమైందని బొత్స ప్రశ్నించారు. ప్రజలు తరిమికొడితే హైదరాబాద్‌లో కాపురం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ హయాంలో జరిగిన దోపిడీ.. పెత్తందారి వ్యవస్థ పవన్ కల్యాణ్‌కు కనిపించలేదా? అని ప్రశ్నించారు బొత్స. రుషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుందని ఏడాది క్రితమే చెప్పానని, ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరిగితే పవన్‌కు ఎందుకు నొప్పి అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+