ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
ఏపీ ఎన్నికల రాజకీయంలో విశాఖ కీలకంగా మారుతోంది. జగన్ ప్రభుత్వం విశాఖ పరిపాలనా రాజధానిగా చెబుతూ వచ్చింది. ఎన్డీఏ కూటమి అమరావతి రాజధానిగా చెబుతోంది. ఇప్పుడు కూటమి పొత్తుల్లో భాగంగా విశాఖ ఎంపీ సీటు నుంచి టీడీపీ పోటీ చేస్తోంది. వైసీపీ నుంచి బొత్సా ఝాన్సీ బరిలోకి దిగారు. ఈ సమయంలో మంత్రి బొత్సా సత్యానారయణ కు విశాఖకు సంబంధించి కీలక ప్రకటన చేసారు. ఎన్నికల వేళ ఈ అంశం చర్చగా మారుతోంది.
విశాఖ కు మెట్రో
విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి బొత్సా చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించామని... కొన్ని కారణాలతో ఆలస్యమైందన్నారు. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని బొత్సా చెప్పుకొచ్చారు. విశాఖ మెట్రోను ఎన్నికల తరువాత కార్యరూపం దాల్చేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయని కీలక ప్రకటన చేసారు. జగన్ చెప్పిన మాటమీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారని బొత్సా వివరించారు.

విశాఖలోనే ప్రమాణ స్వీకారం
విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయని వివరించారు. చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారని బొత్స విమర్శించారు. విశాఖ కూటమి అభ్యర్ది భరత్ పైన బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు భరత్ కు విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు.
భరత్ పై వ్యాఖ్యలు
రాష్ట్రంలో 5 ఏళ్లలో రాష్ట్రంలో 18 వేల మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఇచ్చామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. కూటమి అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేసారు. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ చేయడం లేదని బీజేపీ కీలక నేతలతో చెప్పించాలని బొత్సా సూచించారు. 20 ఏళ్ల కాలంలో దేశంలోనే విశాఖ తలమాణికంగా నిలుస్తుందన్నారు. దేశంలో ప్రధాన నాగరాలను తలదన్నెలా విశాఖ అభివృద్ధి చెందుతుందని బొత్సా చెప్పుకొచ్చారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications