ఏపీ మహిళలు చొక్కా పట్టి అడుగుతారు: బాబుపై బొత్స
హైదరాబాద్: డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు చొక్కా పట్టుకొని అడుగుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
కోర్టుకు వెళ్తాం: గంటా
విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాస రావు తొలిసారి విశాఖ జిల్లా ఆనందపురం మండలం గురజాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాల రిజిస్టర్లు సరిగా నిర్వహించడంలేదని, పదిహేను రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించాలని అక్కడి ఉపాధ్యాయులను మంత్రి ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
టెండర్లు ఖరారు చేస్తాం: బొజ్జల
సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం విక్రయానికి వారంలోగా ఈ టెండర్లు ఖరారు చేస్తామన్నారు. ఎర్రచందనం దొంగలను అరికట్టగలిగామన్నారు.












Click it and Unblock the Notifications