చంద్రబాబుకు బుద్ధి చెబుతారు: బాక్సైట్ తవ్వకాలపై బొత్స ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశాఖలో అపార ఖనిజ సంపద ఉందని ఆ సంపదను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలను నిర్వహిస్తామని అయన అన్నారు.

బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ తీరును ఎండగడతామని బొత్స హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయకుంటే ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
మద్యం మృతులకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి: జగన్
కల్తీ మద్యం ఘటనపై జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటన పై దర్యాప్తు జరిపాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications