బొత్సాకు తీవ్ర అస్వస్థత, వేదికపైనే కుప్పకూలి - హుటా హుటిన..!!

వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్టీ నిర్ణయించిన విధంగా చీపురుపల్లిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లేందుకు సిద్దం అవుతుండగా ఒక్క సారిగా కుప్ప కూలిపోయారు. పార్టీ నేతలు వెంటనే గరివిడి క్యాంపు కార్యాలయంలోకి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసారు. అయితే, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో బొత్సాను విశాఖ తరలించారు. గతంలో బొత్సాకు గుండె ఆపరేషన్ జరిగింది. బొత్సాకు వైద్య పరీక్షల తరువాత హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.

మాజీ మంత్రి.. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్సా సత్యానారాయణ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజుతో ఏడాది పూర్తయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన కారణంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ వైసీపీ ఈ రోజున వెన్నుపోటు కార్య క్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా బొత్సా సత్యనారాయణ తన నియోజక వర్గంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగానికి సిద్దం అవుతు న్న సమయంలో ఒక్క సారిగా బొత్సా కుప్ప కూలిపోయారు. పక్కన ఉన్న పార్టీ నేతలు ఆయనకు సపర్యలు చేసారు. క్యాంపు కార్యాలయంలో వైద్యులు ప్రాధమిక చికిత్స చేసారు.

Botsa Satyanarayana shifts to Visakha Hospital due to sudden health problem

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన సొమ్మ సిల్లిపోయారని చెబుతున్నారు. అయితే, బొత్సా కు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా మెరుగైన చికిత్స కోసం విశాఖ ఆస్పత్రికి తరలించిన ట్లు సమాచారం. బొత్సా ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి ఆరా తీసారు.

కాగా..బొత్సాకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తు న్నారు. పరీక్షలు పూర్తయిన తరువాత వైద్యులు బొత్సా ఆరోగ్యం పైన హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. పరీక్షల నివేదికల ఆధారంగా అవసరమైతే హైదరాబాద్ కు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆందోళన అవసరం లేదని.. బొత్సా ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+