పవన్ కల్యాణ్ పై బొత్సా కీలక వ్యాఖ్యలు...!!

ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ప్రచారం హోరెత్తుతోంది. జగన్ రోజుకు మూడు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ, రాహుల్ ఏపీలో ప్రచారానికి వస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ జనసేనాని పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.

బొత్సా వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పవన్ కళ్యాణ్ అవగాహనలేకుండా.. ఊగుతూ మాట్లాడం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలను ఎందుకు పట్టించుకోవాలన్నారు. ఆయన మాట్లాడే భాష ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలను ఎవరైనా హర్షిస్తారా అని మండిపడ్డారు. ఆయన భాష ఏంటి, ఆయన హావభావాలు ఏంటని అడిగారు. పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రతిపక్ష నాయకుడా అని నిలదీశారు. ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయారన్నారు.

Botsa Seriously reacts over Pawan Kalyan allegations regard Land title act implementation

పవన్ పై ఆగ్రహం
ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు విమర్శిస్తున్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన స్పందించారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజాభిప్రాయ సేకరణ జరగవలసి ఉందని... ఆ తర్వాతే చట్టం అవుతుందని తెలిపారు. దీనిపై కొన్ని పేపర్స్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని.. వాటిని ఖండిస్తున్నామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేస్తామంటున్నారని.. ముందు అధికారంలోకి రావాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు పెరగలేదని చెప్పట్లేదని.. ఎన్నిసార్లు పెంచారో తనకైతే నిజంగా తెలియదన్నారు.

వివాదం ఏముంది
తెలంగాణలో తమ కుమారుడు రెండున్నర ఎకరాలు భూమి కొన్నారని.. ఈ అంశంపై విచారణ జరుగుతుందని.. అందుకు తాము సహకరించామని తెలిపారు. ఇందులో వివాదాంశం ఏముందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేశారన్నారు. కొంతమంది నియోజవర్గాల పరిధిలో వారి మేనిఫెస్టోను వారు విడుదల చేసుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ, జనసేన ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన చేస్తున్న ఆరోపణల పైన ముఖ్యమంత్రి జగన స్పందించారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+