భార్యతో వ్యభిచారం: అనుమానంతో అత్తను చంపిన అల్లుడు

కర్నూల్: కర్నూల్ జిల్లాలో పిల్లను ఇచ్చిన అత్తను హత్య చేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తన భార్యను వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోందనే నెపంతో ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

కర్నూల్ జిల్లా బనగానపల్లి మండలం అప్పలాపురం పొలంలో మార్చి 22న ఓ మహిళ మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఈ మృతదేహం వద్ద దొరికిన ఆనవాళ్ళ ప్రకారంగా మృతురాలు సరస్వతిగా గుర్తించారు.

Brahmaiah arrested for murder Saraswathi in Kurnool district

మృతి చెందిన సరస్వతి రెండో కూతురు జ్యోతిని 11 ఏళ్ళ క్రితం నంద్యాలలో ఉంటున్న బ్రహ్మయ్యకు ఇచ్చి వివాహం చేశారు. సరస్వతి నంద్యాలలోని తన పెద్ద కుమార్తె వద్ద నివాసం ఉంటుంది. అయితే తన భార్యను అత్త సరస్వతి వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోందని బ్రహ్మయ్య అనుమానించాడు.వ్యభిచారానికి అడ్డుగా ఉన్న తనను కూడ చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆయన భావించాడు.

పథకం ప్రకారంగా సరస్వతిని హత్య చేయాలని బ్రహ్మయ్య ప్లాన్ చేశాడు ఎలాంటి అనుమానం రాకుండా చెరుకు రసం ప్యాకెట్లలో సైనెడ్ కలిపాడు ఈ చెరుకు రసాన్ని ఆమెతో తాగించాడు. అయితే మార్చి 22న సరస్వతి మోటార్‌బైక్‌పై వెళ్ళినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు.

మోటార్‌బైకుల నెంబర్ల ఆధారంగా నిందితుల కోసం విచారణ జరిపారు. అయితే ఈ సమయంలోనే బ్రహ్మయ్య ఆయనకు సహకరించిన కంబన్న అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+