కల్వకుంట్ల కవిత అరెస్ట్: భారీ భద్రత: బీఆర్ఎస్ ఆందోళనలు.. ఉద్రిక్తత

Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఎన్నికల వేళ కలకలం..

లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో సంభవించిన ఈ పరిణామం.. బీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతున్న ఈ పరిస్థితుల్లో- సాక్షాత్తూ బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కుమార్తెపై ఈడీ కొరడా ఝుళిపించడం చర్చనీయాంశమౌతోంది.

BRS MLC Kavitha is being brought to Delhi by ED in the Delhi liquor scam

పలు ఆరోపణలు..

కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో రెండు మూడుసార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు కూడా. ఆ తరువాత కూడా ఆమెకు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ నోటీసులు అందాయి.

ఈడీ దాడులు..

ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు సైతం కవితకు సమన్లను జారీ చేశారు. గతంలోనే ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగలేదు. ఆ తరువాత కవిత పేరును ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచినట్లు వార్తలు సైతం వెల్లువెత్తాయి గతంలో. తాజాగా హైదరాబాద్‌లో కవిత నివాసంపై ఈడీ అధికారులు దాడులకు దిగడం అటు రాజకీయంగా కూడా చర్చనీయాంశమౌతోంది.

కవిత అరెస్ట్..

కాగా- సుమారు అయిదు గంటలకు పైగా సాగిన సోదాల అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. తొలుత ఆమెకు అరెస్టు నోటీసులను అందజేశారు. ఆ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవిత అరెస్ట్ విషయాన్ని ఈడీ ఉన్నతాధికారులు ధృవీకరించినట్లు సమాచారం.

ఢిల్లీకి తరలింపు..

కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. అక్కడి ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగిస్తారని చెబుతున్నారు. ఢిల్లీకి తరలించి మరింత సమాచారాన్ని సేకరించాలనే ఉద్దేశంతోనే ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

ఇంటి వద్ద ఆందోళనలు..

ఈడీ అధికారులు సోదాలకు దిగినట్లు సమాచారం అందిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకున్నారు. ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలకు దిగారు. ఆమె ఇంటి వద్దే బైఠాయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినదించారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె ఇంటి వద్ద భారీగా బందోబస్తును మోహరింపజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+