బిటెక్ విద్యార్థి దుర్మరణం: రైలుకు ఎదురెళ్లి...
విశాఖపట్నం/ గుంటూరు: విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం దగ్గర శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బీటెక్ ఫైనలియర్ విద్యార్థి శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరంతా గత రాత్రి సబ్బవరంలోని తన స్నేహితుడి చెల్లెలి వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
మృతుడు శ్రీకాంత్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వాసి. కొద్దిరోజుల క్రితం జరిగిన క్యాంపస్ ఇంటర్వూలో శ్రీకాంత్ విప్రోకు ఎంపికైనట్లు తెలుస్తోంది.

భార్య మరణిస్తుందని తెలిసి భర్త...
భార్య క్యాన్సర్‌తో బాధపడి ఎంతో కాలం జీవించలేదని ఆమె మరణం చూడలేక ఆమె కన్నా ముందే చనిపోవాలని నిర్ణయించుకున్న ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వేజెండ్ల రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది.
వేజెండ్లకు చెందిన దెయ్యాల పెదబాలయ్య (67) శుక్రవారం ఉదయం రేపల్లె నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న డెల్టాప్యాసింజర్‌కు ఎదురుగా వచ్చి అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను విశ్రాంత రైల్వే ఉద్యోగి. ఇతని భార్య శాయమ్మ గత కొన్నాళ్ళుగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతుంది.
ఇటీవల కాలంలో వ్యాధి తీవ్రత చెంది హైదరాబాద్‌లో చికిత్స పొందుతుంది. మరణం తప్పదని తెలియడంతో కుమార్తె లక్ష్మీ ఇంటికి వచ్చిన బాలయ్య శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏడాది క్రితమే అతని పెద్దకూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. రైల్వేపోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications