భూమా ఎఫెక్ట్: పార్టీ నుంచి వెళ్లిపోవాలా.. ఊగిపోయిన శిల్పా, చేతులెత్తేసిన కేఈ
భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిల ప్రియలు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి.
కర్నూలు: భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిల ప్రియలు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. నంద్యాల రాజకీయ పరిస్థితుల పైన తాజాగా శిల్పా ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల లోకసభతో తనకు సంబంధం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతులెత్తేశారు.
శనివారం టిడిపి కర్నూలు జిల్లా సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా ఆశక్తికర చర్చ సాగింది. ఎవరి వాదన వారిదే కావడంతో హాట్‌హాట్‌గా ముగిసింది. సమన్వయంతో వెళ్లమని చెబుతూ, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీలో ఉండమంటారా లేక వెళ్లమంటారా అని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఘాటుగా ప్రశ్నించారు.

హాట్‌హాట్‌గా సమావేశం
ఈ సమావేశానికి నంద్యాల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, బనగానపల్లె ఎమ్మెల్యేలు భూమా నాగి రెడ్డి, అఖిలప్రియ, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు గైర్హాజరయ్యారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, డోన్ ఇంచార్జీలు హాజరయ్యారు. ఈ సమావేశం హాట్ హాట్‌గా సాగింది.

కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం
పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల ఇంచార్జి శిల్పా మోహన్ రెడ్డి.. ఘాటుగా స్పందించారు. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, తమను పిలువడం లేదని ప్రశ్నించారని తెలుస్తోంది. పార్టీలో ఉండమంటారా, వెళ్లమంటారా అని ఉప ముఖ్యమంత్రి కేఈని ప్రశ్నించారు.

కేఈ ఆసహనం
దీనిపై కేఈ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. నంద్యాల లోకసభ నియోజకవర్గంతో తనకు సంబంధం లేదని, కర్నూలు పార్లమెంటు పరిధిలో సమస్యలు వస్తే వాటి పరిష్కారానికి బాధ్యత తీసుకుంటానని చెప్పారని తెలుస్తోంది. నేను పిలిచినప్పుడు పార్టీలోకి వచ్చారా అని పాయింట్ లాగారట. కాగా, నంద్యాల, ఆళ్లగడ్డలలో భూమాకు కీలక నియోజకవర్గాలనే విషయం తెలిసిందే.

చంద్రబాబు మీకే చెప్పమన్నారు
దానికి శిల్పా స్పందిస్తూ.. మీరు ఉప ముఖ్యమంత్రి కాబట్టి అడుగుతున్నామని, చంద్రబాబు కూడా సమస్యలను మీతో చెప్పుకోమని అన్నారని చెప్పారని తెలుస్తోంది. ఎమ్మెల్యే మణిగాంధీ కూడా తన నియోజకవర్గంలో తనకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications