పవన్ ఫొటోలు మార్ఫింగ్?- తిరుపతి సహా పలుచోట్ల

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేశారనే వివాదం తలెత్తింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు లిఖితపూరకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తోన్నారు. కొన్ని చోట్ల కేసులు సైతం నమోదైనట్లు తెలుస్తోంది.

ఇటీవలే పవన్ కల్యాణ్.. తన భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలను ఆచరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేశారని, సోషల్ మీడియాలో ఆయనపై బాడీ షేమింగ్ కామెంట్స్ పెట్టారంటూ జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.

Cases filed against morphing photos of AP Deputy CM Pawan Kalyan

ఈ క్రమంలో విజయవాడలో కొందరు జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు అందాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్లల్లో ఈ మేరకు పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. వాటిపై కొన్ని చోట్ల కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.

పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫ్ చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ జనసేన నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తోన్నారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగనన్న సైన్యం అనే అకౌంట్ హ్యాండిల్ నుంచి పవన్ కల్యాణ్ ఫొటోను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేశారంటూ తిరుపతి నగర విభాగానికి చెందిన జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.

చిత్తూరులో కూడా హరీష్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కల్యాణ్‌పై తప్పుగా పోస్ట్ పెట్టారంటూ జనసేన నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+