విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి చేతికి కొత్త అస్త్రం : టిడిపిలోకి జెడి ల‌క్ష్మీనారాయ‌ణ : 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Elections 2019 : CBI Ex Jd Lakhsmi Narayana Joining In TDP Shortly | Oneindia Telugu

ఎన్నిక‌ల వేళ వైసిపి చేతికి కొత్త అస్త్రం అందివ‌స్తోంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయ‌ణ టిడిపి లో చేరుతున్నార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే..త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. జ‌గ‌న్ కేసుల గురించి టిడిపి ప‌దే ప‌దే ప్ర‌స్తా విస్తోంది. ఇదే స‌మ‌యంలో త‌న పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. ఇక‌..జ‌గ‌న్ కేసుల వ్య‌వ‌హా రం లో సిబిఐ మాజీ జేడి ల‌క్ష్మీనారాయ‌ణ సైతం టిడిపితో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వైసిపి చెబుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న అధికారికంగా టిడిపిలో చేరితే..ఇక ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇదో అంశం కానుంది..

సొంత పార్టీ..ఇప్పుడు టిడిపిలోకి

సొంత పార్టీ..ఇప్పుడు టిడిపిలోకి

సిబిఐ మాజీ జేడి ల‌క్ష్మీనారాయ‌ణ త‌న ఉద్యోగానికి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి ఏపి రాజ‌కీయాల పై దృష్టి పెట్టారు. ఆయ‌న తొలుత బిజెపి లో చేరుతార‌ని..ఆ త‌రువాత జ‌న‌సేన లో చేరుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, సొంతంగా పార్టీ పెట్టాల‌నే లక్ష్యంతో లోక్‌స‌త్తా తో పాటుగా ప్ర‌జాధ్వ‌ని అనే పేరుతో పార్టీ ఏర్పాటుకు ఆలోచ‌న చేసారు. కానీ, ఈ ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ రూపంలో పెట్ట‌లేక పోయారు. కొంత కాంగా స్త‌బ్దుగా ఉన్న మాజీ జెడి ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్పుడు టిడిపిలో చేర‌టానికి రంగం సిద్దం అయింది. ఆయ‌న‌తో ఓ మంత్రి రాయ‌బారం న‌డిపారు. ఆయ‌న టిడిపిలో చేరేందు కు దాదాపు నిర్ణ‌యం జ‌రిగిపోయింది. రెండు మూడు రోజుల్లో టిడిపి అధినేత చంద్ర‌బాబు తో ల‌క్ష్మీనారాయ‌న భేటీ కానున్నారు. ఆ త‌రువాత ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోక్‌స‌భ కు పోటీ చేయాలా లేక అసెంబ్లీకి పోటీ చేయాలా అనే అంశం పై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

2014 ఎన్నిక‌ల్లో టిడిపి వైపు..

2014 ఎన్నిక‌ల్లో టిడిపి వైపు..

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జెడి ల‌క్ష్మీనారాయ‌ణ టిడిపి నుండి పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లోనే ఆయ‌న టిడిపి నుండి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కేసులే ఆయుధంగా టిడి పి ప్ర‌చారం చేసింది. అప్ప‌టికే జ‌గ‌న్ కేసుల విచార‌ణ స‌మ‌యంలో జెడి లక్ష్మీనారాయ‌ణ తీరు పై వైసిపి నేత‌లు ఓపెన్ గానే విమ‌ర్శ‌లు చేసారు. ఆయ‌న‌కు టిడిపిలో సంబంధాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం చేసారు. దీంతో..ఆ ఎన్నిక‌ల్లో నేరుగా ల‌క్ష్మీనారాయ‌ణ టిడిపి నుండి బ‌రిలోకి దిగితే న‌ష్టం జ‌రుగుతుంద‌ని..టిడిపి నేత‌లు వారించారు. దీంతో..ఆయ‌న తిరిగి త‌న విధుల్లోకి వెళ్లిపోయారు. ఇక‌, కొంత కాలంగా ఏపిలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి..ఇప్పుడు టిడిపిలో చేరేందుకు మార్గం సిద్దం చేసుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లోనే ఆయ‌న టిడిపి నుండి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

వైసిపిలోకి ఆలీ.. మాగంటి చేరిక ఖ‌రారు:ఆ ఇద్ద‌రి పోటీ అక్క‌డి నుండే: తొలి జాబితా..బ‌స్ యాత్ర‌..!వైసిపిలోకి ఆలీ.. మాగంటి చేరిక ఖ‌రారు:ఆ ఇద్ద‌రి పోటీ అక్క‌డి నుండే: తొలి జాబితా..బ‌స్ యాత్ర‌..!

వైసిపి చేతికి కొత్త అస్త్రం

వైసిపి చేతికి కొత్త అస్త్రం

ఎన్నిక‌ల వేళ వైసిపి చేతికి కొత్త అస్త్రం చిక్కిన‌ట్లే. జ‌గ‌న్ పై కేసుల‌ను ట‌డిపి అధినేత చంద్ర‌బాబు ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ సైతం ఆ కేసులు కాంగ్రెస్ - టిడిపి క‌లిసి అక్ర‌మంగా బ‌నాయించిన కేసులుగా చెబుతూ వ‌స్తున్నారు. ఇక‌, జ‌గ‌న్ పై కేసులు విచార‌ణ చేసిన అధికారిగా ల‌క్ష్మీనార‌య‌ణ కు గుర్తింపు ఉంది. ఇది త‌మ‌కు ఇప్పుడు అనుకూలిస్తుంద‌ని..మైండ్ గేమ్‌లో భాగంగా.. దీనిని ఎన్నిక‌ల్లో వినియోగించుకోవాల‌ని టిడిపి భావిస్తోంది. ఇదే స‌మ‌యంలో వైసిపి సైతం రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్ట‌నుంది. విచార‌ణ స‌మయంలోనే లక్ష్మీనారాయ ణ శైలి పై వైసిపి నేత‌లు మండి ప‌డ్డారు. విచార‌ణ అంశాలు టిడిపి మ‌ద్ద‌తు మీడియాలో మందుగానే రావ‌టం ద్వారా జెడి పై ఆరోప‌ణ‌లు సంధించారు. ఆయ‌న‌కు టిడిపి తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపించారు. ఇక, ఇప్పుడు నేరుగా ల‌క్ష్మీనారాయ‌ణ టిడిపి అభ్య‌ర్ధిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగితే..త‌మ కేసుల అంశంతో పాటుగా.. టిడిపి - నాటి జెడి ల‌క్ష్మీనారాయణ బంధాన్ని మ‌రింత‌గా ప్ర‌చారం చేసేందుకు కొత్త అస్త్రం దొరికింద‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు.

English summary
CBI ex Jd Lakhsmi Narayana joining in TDP Shortly. He may contest from tdp in up coming elections. Now this development ycp trying to use in election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X