జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన సీబీఐ కోర్టు, అయితే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి సీబీఐ కోర్టు శుభవార్త చెప్పింది. అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు సంపాధించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సీబీఐ అధికారులు చాలా ఏళ్ల క్రితమే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అక్రమాస్తుల కేసులో వైెస్ జగన్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులు ఎప్పటికీ విచారణలో ఉన్నాయి. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తాను యూకే వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకి మనవి చేశారు. అక్రమాస్తుల కేసు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు విచారణకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు ఇటీవల కోర్టుకు చెప్పారు.

CBI special court that allowed former CM YS Jagan s foreign tour

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని ఇటీవల సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. తన కుమార్తె పుట్టిన రోజు కోసం విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని మాజీ సీఎం కోర్టుకు అర్జీ సమర్పించుకున్నారు. ఇరు వర్గాల వాదనలు ఇటీవల పూర్తి అయ్యాయి. ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు మాజీ సీఎం జగన్ సెప్టెంబర్ 3వ తేదీ నుండి 25వ తేదీ వరకు యూకే వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.

అయితే మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలు సీబీఐకి, కోర్టుకి సమర్పించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు మాజీ సీఎం వైఎస్ స్ జగన్ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్ల కాల పరిమితితో వైఎస్ జగన్ కి కొత్త పాస్ పోర్టు తీసుకోవడానికి సీబీఐ ప్రత్యేక కోర్టును అనుమతి ఇచ్చింది. మొత్తం మీద మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ ప్రత్యక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన విదేశాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+