చంద్రబాబు రిక్వెస్ట్ - కేంద్రం అనూహ్య నిర్ణయం..!!
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీ పర్యటనలో కీలక ప్రతిపాదన చేసారు. ఏపీలో మిర్చి ధరలు.. రైతుల సమస్య పైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరించారు. మిర్చి ధర పెంపుతో పాటుగా ఎగుమతుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో, ఈ రోజున శివరాజ్ సింగ్ ఇదే అంశం పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద మిర్చి రైతులను ఆదుకునే అంశం పైన నివేదిక ఇవ్వాలని కోరారు. కనీస మద్దతు ధర పైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పతనమైన ధరలు
ఏపీలో మిర్చి ధరల పతనం పైన మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. తమ హయాంలో ఉన్న ధరలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. గుంటూరు మిర్చి యార్డులో జగన్ రైతుల ను పరామర్శించారు. ఇటు, సీఎం చంద్రబాబు మిర్చి రైతుల సమస్యల పైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాసారు. అదే విధంగా ఢిల్లీ పర్యటనలో ఇదే అంశం పైన వివరించారు. ఎగుమతుల అంశం పైన చర్చించారు. ధరల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

జగన్ పర్యటన - ఢిల్లీలో చంద్రబాబు
చంద్రబాబు అభ్యర్ధనతో ఈ రోజు చౌహాన్ ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేసారు. సమస్య పరిష్కా ర దిశగా తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని ఉన్నతాధికారులను శివరాజ్ సింగ్ చౌ హాన్ ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీ నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు తో పాటుగా పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. మిర్చికి రూ.11,600కు పైగా ధర ఇవ్వాలని కోరినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మిర్చి ఎగుమతులపైనా చర్చించామన్నారు. ఎగు మతి దారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారన్నారు. కేంద్రం మిర్చి రైతులకు సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని భరోసా ఇచ్చారు.
కేంద్రం సమీక్ష
మిర్చి రైతుల విషయంలో చంద్రబాబు కేంద్రం ముందు కీలక ప్రతిపాదనలు చేసారు. మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25% పంట కొనుగోలు సీలింగ్ తొలగించి సాధ్యమైనంత ఎక్కువ పంట కొనుగోలు చేయాలని చంద్రబాబు కోరారు. ఐసీఏఆర్ నిర్ణయించిన మిర్చి ధరలు ఏపీ రైతుల సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఖరారు చేసినట్లు కనిపిస్తోందని... వాటిని సరిదిద్దాలని సూచించారు. మిర్చి కొనుగోలు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు ఎలా పంచుకోవాలో ఆలోచన చేయాలని కోరారు. దీంతో, ఇప్పుడు ఈ ప్రతిపాదనల పైన సమీక్ష చేసి.. రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు.












Click it and Unblock the Notifications