చంద్రబాబు, పవన్ కు అక్కడే అసలు పరీక్ష..!!

ఏపీ రాజకీయం రసవత్తంగా మారుతోంది. ప్రతీ సీటులో గెలుపు ప్రతిష్ఠాత్మకం అవుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తమ అభ్యర్దులను ప్రకటించాయి. జనసేనకు పొత్తులో 23 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అందులో విజయవాడ పరిధిలో ఒక సీటు జనసేక కోరుతోంది. విజయవాడ పశ్చిమం నియోజకవర్గంలో రెండు పార్టీల నుంచి నేతలు టికెట్ రేసులో ఉన్నారు. సీటు తమదే అంటూ ధీమాగా ఉన్నారు. ఇక్కడ సీటు కేటాయంపు చంద్రబాబు, పవన్ కు పరీక్షగా మారుతోంది.

సీటు కోసం పోటీ
విజయవాడ సెంట్రల్ లో 2014,2019లో వరుసగా వైసీపీ విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ మరోసారి మైనార్టీ అభ్యర్దిని బరిలోకి దించింది. షేక్ ఆసిఫ్ కు నియోజవర్గ బాధ్యతలు కేటాయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ అభ్యర్దిగా ప్రకటించింది. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణుకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇక, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న టికెట్ ఆశిస్తున్నారు. జలీల్ ఖాన్ ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. బుద్దా వెంకన్న తనకు చంద్రబాబు పైన ఉన్న గౌరవం చాటుకొనేందుకు రక్తాభిషేకం కూడా చేసారు. తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Chandra Babu and Pawan Kalyan struggling to finalise the Vijayawada West seat

రేసులో నిలచేదెవరు
పశ్చిమం సీటు జనసేనకు ఇస్తున్నారని..పవన్ ప్రకటన చేస్తారని ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన మహేష్ చెప్పుకొచ్చారు. దీంతో, ఎవరికి సీటు దక్కుతుందనే పోటీ కొనసాగుతోంది. తొలి జాబితాలో ఈ వివాదం కారణంగానే సీటు ప్రకటించలేదని సమాచారం. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో జనసేనకు అవనిగడ్డతో పాటుగా విజయవాడ పశ్చిమం ఖాయమని తెలుస్తోంది. అయితే, ప్రకటన వచ్చే వరకు సీటు కోసం ఒత్తిడి చేస్తూనే..ప్రకటన తరువాత నిర్ణయం దిశగా ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 2014లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన జలల్ ఖాన్ తరువాతి కాలంలో టీడీపీలో చేరారు. ఇప్పుడు సీటు టీడీపీ నుంచి ఆశిస్తూ..వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డిని కలిసారు. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ బుజ్జగించి..వేచి చూడాని సూచించింది.

గెలుపు దక్కేదెవరికి
విజయవాడలో ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. ఎంపీగా ఉన్న కేశినేని నాని ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి నగరంలోని మూడు నియోజకవర్గాలకు అభ్యర్దుతు ఖరారయ్యారు. టీడీపీ నుంచి తూర్పు - గద్దే రామ్మోహన్, సెంట్రల్ - బోండా ఉమాకు కేటాయించారు. పశ్చిమం నుంచి బీసీ లేదా మైనార్టీ వర్గాలకు ఇవ్వాల్సి ఉంటుంది. రెండు వర్గాలకు చెందిన నేతలే రెండు పార్టీల నుంచి ఆశావాహులుగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం తరువాత టీడీపీ ఈ నియోజకవర్గంలో గెలవలేదు. ఇప్పుడు పొత్తులతో ఆ సీటు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే, అభ్యర్ది ఎంపిక దగ్గరే సమస్య మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో..విజయవాడ పశ్చిమంలో అభ్యర్ది..గెలుపు ఎవరదినే ఆసక్తి రాజకీయంగా మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+