చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కలిసి కట్టుగా - అమరావతి పై కీలక నిర్ణయం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం జగన్ టార్గెట్ గా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్న బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో మూడు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణకు సిద్దమయ్యాయి. అందుకు అమరావతి వేదికగా నిలవనుంది. ఈ నెల 17న అమరావతిలో జరిగే భారీ సభలో ముగ్గురు నేతలు పాల్గొంటున్నారు. ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

అమరావతి వేదికగా
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రకటన చేసారు. సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులు ప్రకటన చేసి డిసెంబర్‌ 17 నాటికి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అమరావతి సమన్వయ కమిటీ, అమరావతి జెఎసి నాయకులు ప్రకటించారు.

Chandra Babu and Pawan Kalyan to Attend Amaravati Farmers protest meeting on 17th December

ప్రభుత్వ నిర్భంధాన్ని, ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి ఉద్యమాన్ని రాజధాని గ్రామాల్లో నిరాటంగా కొనసాగిస్తున్నామన్నారు.17న జరిగే సభకు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు పార్టీలు అమరావతికి మద్దతు ప్రకటించాయి.

ప్రతిపక్షాలకు వేదికగా
2014లో చంద్రబాబు ప్రమణ స్వీకారం చేసిన మైదానంలోనే ఇప్పుడు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగున్న వేళ సీఎం జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభానికి సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో అమరావతి వేదికగా ప్రతిపక్షాలు ఐక్యత ప్రదర్శిస్తున్నాయి. పొత్తు ప్రకటన తరువాత చంద్రబాబు - పవన్ ఒకే వేదిక మీదకు రానుండటం రాజకీయంగానూ ఆసక్తి పెంచుతోంది.

ఇదే వేదిక పైన పురందేశ్వరి సైతం రానుండటంతో పొత్తుల చర్చల వేళ కీలకంగా మారుతోంది. వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు హాజరవుతారని చెబుతున్నారు. అటు రాజధాని కేసు ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్ లో ఉంది. పార్టీలతో పాటుగా దళిత సంఘాలు..ప్రజా సంఘాల నేతలను సభకు ఆహ్వానిస్తున్నారు.

Chandra Babu and Pawan Kalyan to Attend Amaravati Farmers protest meeting on 17th December

ఎన్నికల వేళ కీలకంగా
అమరావతి రాజధానిగా కొనసాగాలనేది తమ విధానమని ఇప్పటికే బీజేపీ స్ఫష్టం చేసింది. అమరావతికి మద్దతుగా పవన్ తన వైఖరి తేల్చి చెప్పారు. ఇక..ఇప్పుడు జగన్ లక్ష్యంగా ఎన్నికల పోరాటానికి సిద్దం అవుతున్న ప్రతిపక్షాలు అమరావతి వేదికగా తమ కార్యాచరణ ప్రకటించనున్నాయి. చంద్రబాబు - పవన్ కలిసి రాష్ట్రంలో బహిరంగ సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు.

ఈ నెల 17న అమరావతి సభ తరువాత 20న విజయనగరంలో లోకేశ్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటున్నారు. అటు కాంగ్రెస్ హైకమాండ్ సైతం అమరావతికి మద్దతుగా నిలుస్తుండటంతో.. 2024 ఎన్నికల యుద్దం వేళ ఈ సభ రాజకీయంగా కీలకం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+