ఆ ఎమ్మెల్యేలపై చంద్రబాబు కీలక నిర్ణయం - వాట్ నెక్స్ట్..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి లోని కొందరు ఎమ్మెల్యేల తీరు పైన ఫిర్యాదులు వస్తున్నాయి. వారి తీరు వివాదాస్పదంగా మారుతోంది. మద్యం దుకాణాల నుంచి వాటాలు కోరుతున్నట్లు ఆరోపణలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు చెప్పినా వారిలో మార్పు రావటం లేదు. దీంతో, అసెంబ్లీ సమావేశాల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

ఎమ్మెల్యేలకు శిక్షణ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం రానున్న నాలుగు నెలల కాలానికి బడ్జెట్ సభలో రూ 2.94 లక్షల కోట్లతో ప్రతిపాదించింది. వ్యవసాయ బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశ పెట్టారు. ఎన్నికల హామీల గురించి ప్రస్తావించారు. ఇక..సమావేశాల సమయం లోనే కూటమిలోని మూడు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టటంతో రేపు (మంగళవారం) సభకు సెలవు ప్రకటించారు. రేపు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. మూడు పార్టీల నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉండటంతో వారికి శిక్షణ ఇప్పటించాని పవన్ సూచించారు. దీంతో, రేపు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసారు.

Chandra Babu and pawan meeting with MLA s on 12th to direct on future action plan

కూటమి ఎమ్మెల్యేల సమావేశం
అదే విధంగా మూడు పార్టీల ఎమ్మెల్యేలతోనూ సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. గతంలో నిర్వహించిన మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలోనూ.. ఆ తరువాత టీడీపీ శాసనసభా పక్ష సమావేశంలోనూ కూటమి ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి.. వ్యవహార శైలి గురించి చంద్రబాబు, పవన్ సూచనలు చేసారు. అయితే, రాష్ట్రంలో మద్యం - ఇసుక వ్యవహారాల్లో ఎమ్మెల్యేల జోక్యం పైన ఫిర్యాదులు వస్తున్నాయి. కొంత మంది తీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంఛార్జ్ మంత్రులు ఈ వ్యవహారం లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, మద్యం దుకాణాల నుంచి వాటాలు కోరుతున్నారనే ఫిర్యాదు లపైన సీఎం పూర్తి సమాచారం సేకరించారు.

ఎమ్మెల్యేల తీరుపై
వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఘటనల కారణంగానే ఆ పార్టీ 11 సీట్లకు పరిమితం అయిందని పవన్ ప్రతీ సందర్భంలోనూ చెబుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంతో పాటుగా ఎమ్మెల్యేలు ఇసుక - మద్యం అంశాల్లో జోక్యం పైన పిఠాపురంలో పవన్ వ్యాఖ్యల సమయంలో స్పందించారు. ఇప్పుడు మూడు పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయటం ద్వారా ఈ అంశాలను తిరిగి ప్రస్తావించనున్నారు. ఏ ఎమ్మెల్యే ఇలాంటి వివాదాల్లో ఉంటే వారి పైన ఒక చర్యలే ఉంటాయనే హెచ్చరిక చేసేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో, రేపు జరిగే కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఏం జరుగుతుంది. .చంద్రబాబు ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+