పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు కీలక హామీ..!!
ఏపీలో పరిశ్రమలకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అత్యుత్తమ పారిశ్రామిక విధానం అందుబాటులో కి తీసుకొస్తున్నామని చెప్పారు. అమరావతితో త్వరలో ఇంటింటికి గ్యాస్ తో పాటుగా ఏసీ కూడా అందిస్తామని చెప్పుకొచ్చారు. శ్రీసిటీలో రానున్న రోజుల్లో మరిన్నికొత్త పరిశ్రమలు ప్రారంభం అవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేసారు.
సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.మొత్తం 15 సంస్థల కార్యకలాపాలను ఆయన ప్రారంభించిన ఆయన మరో ఏడు సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఇక, పలు సంస్థలను చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్, ఇజ్రాయిల్‌కు చెందిన నియోలింక్, జపాన్‌కు చెందిన నైడిక్, ఓజెఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారతదేశానికి చెందిన అడ్మైర్, ఆటోడేటా, బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈప్యాక్, ఇఎస్‌ఎస్‌కెఏవై, ఎవర్‌షైన్, జేజీఐ, త్రినాత్, జెన్‌లెనిన్ సంస్థల కార్యాకలాపాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

రూ. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని చంద్రబాబు ప్రకటివంచారు. చైనాకు చెందిన ఎన్‌జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్, జపాన్‌కు చెందిన ఏజీ ఆండ్ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా జపాన్‌కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఇ, సింగపూర్‌లతో పాటు భారతదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకున్నారు. వాటి పెట్టుబడుల విలువ 1,213కోట్ల రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది.పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సీఎం వివరించారు.












Click it and Unblock the Notifications