వైసీపీ కంచుకోటలో టీడీపీ అభ్యర్థి మార్పు - కొత్త టెన్షన్...!!
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో మూడు పార్టీల సీట్లు, పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అయితే, అభ్యర్థు విషయంలో సొంత పార్టీల్లోనే వస్తున్న సమస్యలతో బీజేపీ, టీడీపీలో కొందరి అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. సర్వే నివేదికలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు అభ్యర్థుల మార్పు పైన కసరత్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా కురుపాం లో అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
అభ్యర్థుల మార్పు
వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తొలుత ప్రకటించిన అభ్యర్థుల మార్పు పైన టీడీపీలో కసరత్తు జరుగుతోంది. తాను ప్రకటించిన అభ్యర్థుల విషయంలో అవసరమైతే చివరి వరకు మార్పులు ఉంటాయని గతంలోనే చంద్రబాబు స్పష్టం చేసారు. అందులో భాగంగా వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు రోజు వారీ సమీక్షలు చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో పార్టీ ప్రకటించిన అభ్యర్థి తోయక జగదీశ్వరి మార్పు ఖాయమని తెలుస్తోంది. కురుపాం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పోటీలో ఉన్నారు. రెండు సార్లు వరుసగా గెలిచిన పుష్పశ్రీవాణిని మూడో సారి గెలిచేందుకు ప్రచారంలో ముందున్నారు.

కురుపాంలో కొత్త అభ్యర్థి
దీంతో, అక్కడ అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. తోయక జగదీశ్వరి స్థానంలో మరో అభ్యర్థిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్పశ్రీవాణిని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థిని దింపాలని డిసైడ్ అయినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే కురుపాం రాజుల కుటుంబాన్ని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్న చంద్రబాబు..తాజాగా ప్రదీవ్ దేవ్ కుమారుడు వీరేష్ చంద్ర దేవ్ పేరును పరిశీలిస్తున్న ట్లుగా సమాచారం. కురుపాం నుంచి జగదీశ్వరిని తప్పించి వీరేష్ చంద్ర దేవ్‌నే ఖరారు చేయటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వీరేష్ దేవ్ కు సీటు విషయం పైన స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. దీంతో, తోయక జగదీశ్వరికి తాజా పరిణామాలు అవమానంగా అనుచర వర్గం భావిస్తోంది.

టీడీపీ అభ్యర్థుల్లో టెన్షన్
ఎన్నికల కోడ్ కు విరుద్దంగా పార్టీలో చేరికలు నిర్వహించిన తోయక జగదీశ్వరి భర్త అయిన సన్యాసి నాయుడుపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు కురుపాం సీటు వీరేష్ చంద్రదేవ్‌కు ఇస్తుండటంతో తోయక జగదీశ్వరి వర్గంలో ఆందోళన మొదలైంది. అటు వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి ప్రచారంలో ముందున్నారు. కురుపాంతో పాటుగా అనంతపురం, గోదావరి, గుంటూరు జిల్లాల్లో దాదాపు 12 -15 మంది వరకు టీడీపీలో ప్రస్తుతం అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో, చంద్రబాబు తాజా నిర్ణయాల పైన అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications