కడప గడ్డ నుంచి చంద్రబాబు కొత్త నినాదం..!!
ఏపీలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. సీఎం జగన్ , చంద్రబాబు ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ తన ప్రచారం ప్రారంభించారు. జగన్ సొంత జిల్లా కడపలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అటు జగన్ అనంతపురం జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే కూటమి గెలుపు అవసరం గురించి వివరించిన చంద్రబాబు.. రాయసీమ జిల్లాల్లో ఫోకస్ చేసారు.
టిడిపి అధినేత చంద్రబాబు సీఎం జగన్ లక్ష్యంగా కడపలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ రతనాలసీమగా మార్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అసమర్ధ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చేవన్నీ పేర్కొన్నారు. రెండుసార్లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి స్టీల్ ప్లాంట్ ఏం చేశారని ప్రశ్నించారు. తమ హయాంలో రాయలసీమకు కియో మోటార్స్ తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశారు జగన్ చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు.

ఎన్నికల్లో కూటమి గెలవడం ఖాయమని వైసిపి ఓడిపోవడం తద్యమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల ప్రజల కూడా జగన్ నమ్మేది లేదంటున్నారని.. ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని విశ్లేషించారు. ప్రస్తుతం రెండు మారిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైసిపి నేతల దాడులకు టిడిపి కార్యకర్తలు భయపడటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమకు నీలిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలవరం పూర్తిచేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలనేది తన సంకల్పంగా పేర్కొన్నారు. ఇందుకోసం 72% పనులు పూర్తి చేశామని వెల్లడించారు. కిట్టి జగన్.. సేవ్ రాయలసీమ నినాదం కావాలని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications