జగన్‌ను దెబ్బతీసేందుకే బాబు: నిప్పులు చెరిగిన రోజా

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పదవీ వ్యామోహంలో ఉన్నాయన్నారు. ప్రజలు ఏమైతే మాకేంటి అన్న ధోరణిలో ఆ రెండు పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాకుండా చేసేందుకే కాంగ్రెసు పార్టీతో కలిసి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
చంద్రబాబు ఢిల్లీలో ఉండి విభజన ప్రక్రియను పూర్తి చేయించాలని ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరున్నర కోట్ల మంది విభజన వద్దంటుంటే బాబు మాత్రం ఆరాటపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవించి విభజన చేయడం లేదని రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే అన్నారు. బాబుకు రాష్ట్రంలో దీక్ష చేసేందుకు సిగ్గేస్తుందని ఎద్దేవా చేశారు.
బొత్స ఆస్తులపై దాడి అందుకే: కోమటిరెడ్డి
విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు కట్టుబడి ఉన్నందుకే ఆయన ఆస్తుల పైన దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొండలో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో బొత్స సీల్డ్ కవర్‌లో వచ్చిన వ్యక్తి కాదన్నారు.
తెలంగాణలో ఉద్రిక్తలు సృష్టించేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు దీక్షకు పూనుకున్నారన్నారు. టిటిడిపి నేతలు త్వరగా పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేయాలని తెరాస నేత కడియం శ్రీహరి వేరుగా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications