టీడీపీ ఎమ్మెల్యేకి చివరి హెచ్చరిక...?
టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. సదరుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడు నెలల్లో రెండోసారి ఆయన తీరుపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ ఎంపీపీ అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్నారనే కారణంగా ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి ఎంపీపీకి చెందిన భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పని చేయడంతోనే తనపై ఇలా క్షక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలా దాడులకు పాల్పడటం సరైంది కాదని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఆ ఎమ్మెల్యేకు చీవాట్లు కూడా పెట్టారు. ఇదే విధంగా రోడ్లు వేయలేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనగా రోడ్డు మీద ఉన్న అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి సంబంధించిన పనులను మొదలుపెట్టాల్సి ఉందని తెలపడంతో ఆ ఎమ్మెల్యే సైలెంట్‌గా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలపై బూతులు మాట్లాడ్డంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాదు, మహిళలను అధికారికంగా ఐదు గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలి నియోజకవర్గంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తోందన్న భయం టీడీపీలో నెలకుంది. ఎమ్మెల్యేతో వేగలేక సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు గతంలో ధర్నాలు చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ అధినేత తల పట్టుకుంటున్నారు.ఆ ఎమ్మెల్యేను ఇలాగే వదిలేస్తే, రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవనే చర్చకు తెరలేచింది.రెండు రోజుల క్రితం తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం.. పార్టీ నేతలు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. అదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై చర్చ జరగగా, ఆయనను క్రమశిక్షణ సంఘం ముందు హాజరుకావాలని ఆదేశించారు.దీంతో ఆ ఎమ్మెల్యే ఎక్కువ కాలం పార్టీలో ఉండే అవకాశం లేదని టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications