బుద్ధి చెప్పారు: రోజాకు అఖిలప్రియ గట్టి కౌంటర్, 'జగన్‌కు డిపాజిట్ కూడా దక్కొద్దు'
తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదని, ఈ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా తరుచూ విమర్శిస్తారు. దీనిపై మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం నంద్యాల సభలో కౌంటర్ ఇచ్చారు.
నంద్యాల: తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదని, ఈ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా తరుచూ విమర్శిస్తారు. దీనిపై మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం నంద్యాల సభలో కౌంటర్ ఇచ్చారు.

రోజాకు అఖిలప్రియ కౌంటర్
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారికి బుద్ధి చెప్పి ఓడించారని అఖిలప్రియ అన్నారు. కాగా, అఖిలప్రియ దుస్తులపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలప్రియ పరోక్షంగా పై వ్యాఖ్యలు చేశారు.

పరిటాల సునీత, శోభా, ఇప్పుడు నేను
రాజకీయాల్లో మహిళలు రాణించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం నుంచి పరిటాల సునీతను, దివంగత నేత భూమా శోభానాగి రెడ్డిని, ప్రస్తుతం తనను ఎంతగానో ప్రోత్సహించారని అఖిలప్రియ అన్నారు. మహిళల సాధికారత టిడిపితోనే సాధ్యమన్నారు.

టిడిపికి ఓట్లు వేశారు, థ్యాంక్స్
కొన్ని ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ఎన్నో హామీలు ఇచ్చి వాటిని విస్మరిస్తాయని, అయితే టిడిపి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి వారి ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తోందని అఖిలప్రియ అన్నారు. నంద్యాల ప్రాంతంలోని ముస్లీం మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున టిడిపికి ఓట్లు వేసి గెలిపించారన్నారు. వారికి థ్యాంక్స్ అన్నారు.

జగన్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కొద్దు
వచ్చే ఎన్నికల్లో వైసిపికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే సభలో పిలుపునిచ్చారు. వైసిపికి అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప మరో పని లేదన్నారు. వారికి దశాదిశా లేకుండా పోయిందని, అలాంటి ప్రతిపక్షం అవసరం లేదన్నారు.

అందుకే నంద్యాలకు వచ్చా
నంద్యాలలో ప్రారంభించిన పనులు చూసి సమీక్ష చేసి చెప్పిన మాట నిలబెట్టకోవడానికే నంద్యాలకు వచ్చానని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం వేరు కాదని, నంద్యాల ఎన్నికలు సవాలుగా తీసుకొని సత్తా చాటామని చంద్రబాబు అన్నారు.

బిల్డింగులు కూలిస్తే అభివృద్ధా అని జగన్ అడిగారు
ఈ నెల 7న మళ్లీ నంద్యాలకు వస్తానని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రతి పనిని అడ్డుకుంటే, తాను ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండేలా పనులు చేస్తున్నానని చెప్పారు. బిల్డింగులు కూలిస్తే అభివృద్ధా అని నంద్యాల ప్రచారంలో జగన్ ప్రశ్నించారన్నారు. కానీ తాము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications