చంద్రబాబు స్పష్టంగా ఉన్నా: నామా, బిఏసిపై వ్యూహాలు

విభజన అంశంపై లోకసభ, లోక్‌పాల్ పైన రాజ్యసభలు వాయిదాపడ్డాయి. అనంతరం నామా విలేకరులతో మాట్లాడారు. లోక్‌పాల్ బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నామన్నారు. విభజనపై చంద్రబాబు ఎప్పుడో స్పష్టం చేశారన్నారు. ఇరు పక్షాలకు న్యాయం జరగాలనేదే బాబు ఉద్దేశ్యమన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ సీమాంధ్రకు న్యాయం చేయాలన్నారు. అధికారం కోసం తెలుగుజాతిలో కాంగ్రెసు పార్టీ చిచ్చుపెట్టిందని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం పైన సభలో చర్చ జరగాలన్నారు. తొమ్మిదేళ్ల యూపిఏ హయాంలో భారీ అవినీతి జరిగిందని, పదేళ్ల క్రితమే లోక్‌పాల్ వస్తే ఇంత అవినీతి జరగకపోయి ఉండేదన్నారు.
శాసనమండలి బిఏసి
హైదరాబాదులో శాసనమండలి బిఏసి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ బాబు, రామచంద్రయ్యలు పాల్గొన్నారు. మండలి బిఏసి అనంతరం శాసనసభ బిఏసి జరగనుంది.
ఇరుప్రాంత నేతల వ్యూహాలు
శాసనసభ బిఏసిలో అనుసరించాల్సిన విషయమై ఇరు ప్రాంతాల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. సీమాంధ్ర ప్రాంత నేతలు కూడా తమ వ్యూహాలు రచిస్తున్నారు. బిఏసిలో మద్దతు కోసం తాము అన్ని పార్టీల సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. అసెంబ్లీకి బిల్లు వస్తే మరో బిఏసిని పెట్టాకనే చర్చకు అనుమతిస్తామని స్పీకర్ గత బిఏసిలో చెప్పారని శోభా నాగి రెడ్డి చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications