అలయ్-బలయ్: మరోసారి ఒకేవేదిక పైకి బాబు, కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దసరా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు రానున్నారు. దీంతో, కేసీఆర్, చంద్రబాబులను మరోసారి ఒకే వేదిక పైన చూడబోతున్నాం.
బుధవారం బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రజల్లో వైషమయ్లాు దూరం చేసేందుకు అలయ్ బలయ్ దోహదపడుతుందని చెప్పారు.

ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎంలు చంద్రబాబు కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ శాస నమండలి చైర్మన్ స్వామి గౌడ్, శాసన సభాపతి మధుసూదనాచారిలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications