వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతి ఉప ఎన్నికకు పర్యవేక్షణ కమిటీ .. తెగించి పోరాడండి : టీడీపీ నేతల కీలక భేటీలో చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో కీలక భేటీ నిర్వహించారు. తాజాగా రాష్ట్రంలోని పరిస్థితులు, సిఐడి నోటీసులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తిరుపతి ఉప ఎన్నిక తదితర అంశాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. తిరుపతి ఉప ఎన్నిక గురించి కీలక విషయాలు చెప్పారు చంద్రబాబు .

తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక .. వైసీపీ అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఏమన్నారంటేతిరుపతి లోక్సభ ఉప ఎన్నిక .. వైసీపీ అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఏమన్నారంటే

 తెగించి పోరాడే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందన్న చంద్రబాబు

తెగించి పోరాడే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందన్న చంద్రబాబు

తెగించి పోరాడాలని , తెగించి పోరాడే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయాలని, అలా పని చేయకుండా కబుర్లు చెప్తే కుదరదని గట్టిగా చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే లోపు ఇదే పెద్ద ఉపఎన్నిక అని పేర్కొన్న చంద్రబాబు తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నిక పై దృష్టి పెట్టాలన్నారు. రిజర్వేషన్లు, మొహమాటాలు, విధేయతలు ఇకపై చెల్లవని పేర్కొన్నారు చంద్రబాబు.

వైసిపి వైఫల్యాలను ముఖ్యంగా 10 గుర్తించి వాటిని ప్రతి ఇంటికి ప్రచారం చేయాలి

వైసిపి వైఫల్యాలను ముఖ్యంగా 10 గుర్తించి వాటిని ప్రతి ఇంటికి ప్రచారం చేయాలి

వైసిపి వైఫల్యాలను ముఖ్యంగా 10 గుర్తించి వాటిని ప్రతి ఇంటికి ప్రచారం చేయాలని పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతున్నాయని, క్షేత్రస్థాయిలో సరిగ్గా ఎవరూ పనిచేయలేదు అనే భావన కలుగుతుందని చంద్రబాబు అన్నారు. ప్రతి క్లస్టర్ కు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన చంద్రబాబు ఐదుగురు సభ్యులతో తిరుపతి ఉప ఎన్నిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

 తిరుపతి ఉప ఎన్నిక పర్యవేక్షణ కమిటీలో సభ్యులుగా లోకేష్ , అచ్చెన్నతో పాటు మరో ముగ్గురు

తిరుపతి ఉప ఎన్నిక పర్యవేక్షణ కమిటీలో సభ్యులుగా లోకేష్ , అచ్చెన్నతో పాటు మరో ముగ్గురు

ఈ కమిటీలో అచ్చెన్నాయుడు, లోకేష్, పనబాక కృష్ణయ్య, బీదా రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉంటారని చంద్రబాబు వెల్లడించారు. ఏప్రిల్ 17వ తేదీన జరగనున్న తిరుపతి ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ నుండి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీలో నిలపాలని భావించిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదిలా ఉంటే మార్చి 24 వ తేదీన పనబాక లక్ష్మి తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు గా తెలుస్తుంది.

English summary
TDP chief Chandrababu Naidu commented that those who fight desperately will have recognition in the party. He emphasized that the leaders should work at the field level . It was clarified that a Tirupati by-election monitoring committee would be set up
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X