ఎప్పుడో జైలుకు: జగన్, వైయస్‌లను ఏకిపారేసిన వర్ల

Chandrababu meets PM, seeks special category status for residual AP
హైదరాబాద్: హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిల పైన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం నిప్పులు చెరిగారు.జగన్, వైయస్సార్‌లది నేర చరిత అని, నేరాలు చెయ్యడంలో వారిద్దరు పేటెంట్ హక్కు పొందారని ఎద్దేవా చేశారు. గంగిరెడ్డిని ఎర్రచందనం స్మగ్లర్ అంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఆయన మీ ముఠాలో సభ్యుడు కాదా అన్నారు.

గంగిరెడ్డికి జగన్‌కు మధ్య సంబంధం లేదా అన్నారు. దాడులు చేసే సంస్కృతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీదేనని, టిడిపి నేతలకు అలాంటివి తెలియదన్నారు. చంద్రబాబు గొప్పతనం తెలియక కొత్తగా ఎన్నికైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు.

రెండు వందల మంది టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకుంది మీ నాయకుడే అన్నారు. పరిటాల హత్య కేసులో సిబిఐ, వైయస్సార్, సోనియా న్యాయబద్ధంగా వ్యవహరించి ఉంటే జగన్ ఏనాడో జైలుకు వెళ్లేవారన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదం పెరగడానికి కారణం వైయస్సే అని ఆరోపించారు. దొంగ పాసుపోర్టులతో గంగిరెడ్డి విదేశాలకు పారిపోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహకరించిందని విరుచుకుపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్లలో 90 శాతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే అన్నారు. త్వరలోనే ఆ చిట్టా బయటపెడతామన్నారు.

రాజమండ్రిలో జగన్ పార్టీ సమీక్ష సమావేశాలు

వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో రాజమండ్రిలో జగన్ పార్టీ జిల్లాల వారీ సమీక్షలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ సమావేశాలకు పార్టీ అధ్యక్షులు జగన్ హాజరవుతున్నారు. పార్టీ ఎన్నికల్లో సాధించిన విజయాలు, ఒటమికి దారితీసిన పరిస్దితులను జగన్ సమీక్షిస్తారు.

రాజమండ్రి సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల నేతలు హాజరవుతారు. జూన్ 9, 10 తేదీల్లో ఒంగోలులో సమీక్షను నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతలు ఈ సమీక్షకు హాజరవుతారు. జూన్ 11, 12 తేదీల్లో అనంతపురంలో జరిగే సమీక్ష సమావేశంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల నేతలు హాజరవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+