అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ

కేంద్రమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఆదివారం జరిగే ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి విజయవాడ వచ్చిన కేంద్ర అమిత్ షాకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్, అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు అమిత్ షాకు స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం.

Chandrababu Naidu Pawan Kalyan hold crucial meeting with Union Minister Amit Shah

ఈ సందర్భంగా అమిత్ షాకు సీఎం చంద్రబాబు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితోపాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. కాగా, శనివారం రాత్రికి విజయవాడలోని ప్రైవేట్ హోటల్‌లో అమిత్ షా బస చేయనున్నారు. ఆదివారం గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో అమిత్ షా తోపాటు చంద్రబాబు పాల్గొననున్నారు.

ఆదివారం ఉదయం 11.30 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చేరుకుంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సౌత్ క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. మరోవైపు, ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఏపీ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11, 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఏపీ పర్యటనకు అమిత్ షా రావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+