చింతమనేని నుంచి అంబరీష్ దాకా: చంద్రబాబు పట్టు తప్పుతున్న వైనం

తన పార్టీ నేతలపై చంద్రబాబు నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకులను అదుపు చేసే పరిస్థితిలో కూడా ఆయన లేరా అనే సందేహాలు కలుగుతున్నాయి.

విజయవాడ: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరుగా ఉండేది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్లురిమితే నాయకులు ఉలిక్కిపడేవారు. కానీ, తెలుగుదేశం పార్టీలో పరిస్థితి అదుపు తప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అధికారం ఉంది కదా అని రెచ్చిపోయే నాయకుల పుత్రరత్నాలు కూడా పెరిగి పోయారు.

ఎమ్మార్వో వనజాక్షి ఉదంతం నుంచి వరుసగా సంఘటనలు జరుగుతున్నా తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రమే. విపరీత సంఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు వార్తలు రావడం, ఇటువంటి సంఘటనలు జరిగితే సహించేది లేదన్నట్లు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆ వార్తలు రావడం అతి సాధారణంగా మారింది.

మంత్రులు పుత్రరత్నాలు మాత్రమే కాదు, శాసనసభ్యులు కూడా కట్టుతప్పిన వైనం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఎమ్మెల్యేలు బహరింగ విమర్శలకు దిగినా తీసుకున్న చర్యలు శూన్యం. వారిని బుజ్జగించినట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి.

ఎంపి కేశినేని దాడి చేస్తే...

ఎంపి కేశినేని దాడి చేస్తే...

ఇటీవల విజయవాడలో జరిగిన ఉదంతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలిని బయటపెట్టింది. పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు, మరో ఎమ్మెల్సీ ఏకంగా రవాణా శాఖ కమిషనర్‌పై దాడి చేశారు. చంద్రబాబు ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ సంఘటన సివిల్ సర్వీసు అధికారులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

 ఏర్పేడు ఘటన మరో ఉదంతం....

ఏర్పేడు ఘటన మరో ఉదంతం....

చిత్తూరు జిల్లాలో లారీని నడిపించి 17 మందిని పొట్టన పెట్టుకోవడంలో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సంఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు. ప్రమాదం మాత్రమేనని డ్రైవర్‌పై నిందలు వేయడం ప్రారంభించారు. కానీ, చంద్రబాబు ఇద్దరు తెలుగుదేశం ముఖ్యులను సస్పెండ్ చేశారు. సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణకు ఆదేశించారు. అంటే, కేవలం అది ప్రమాదం కాదని పరోక్షంగా అంగీకరించినట్లయింది.

తాజాగా నిమ్మల కిష్టప్ప పుత్రరత్నం...

తాజాగా నిమ్మల కిష్టప్ప పుత్రరత్నం...

ఏర్పేడు ఘటనను మరిచిపోక ముందే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప కుమారుడు నిమ్మల అంబరీష్ సంఘటన తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌గేట్‌ను ఆయన ధ్వంసం సేఛారు. సిబ్బందిపై దాడి చేశారు. మళ్లీ అదే వ్యవహారం. ఈ సంఘటనపై చంద్రబాబు కళ్లెర్ర చేసినట్లు వార్తలు వచ్చాయి.

కట్టు తప్పి ఇలా...

కట్టు తప్పి ఇలా...

నంద్యాల శానససభ సీటు ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు చంద్రబాబు తలకు చుట్టుకుంది. భూమా నాగిరెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీ అయింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ, శిల్పా మోహన్ రెడ్డి ఎదురు తిరుగుతున్నారు. టికెట్ ఇవ్వకపోతే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారేట్లున్నారు. దాంతో ఆయనను కాదని నిర్ణయం తీసుకునే తెగువ గతంలో మాదిరిగా చంద్రబాబు చూపించలేకపోతున్నారు.

 వారంతా కట్టు తప్పి...

వారంతా కట్టు తప్పి...

మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. మంత్రి పదవి కోల్పోయిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి బహిరంగ వ్యాఖ్యలకే దిగారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జలీల్ ఖాన్, చింతమనేని మంత్రి పదవులు కావాలంటూ గోల చేస్తున్నారు. వారిని అదుపు చేసే పరిస్థితిలో చంద్రబాబు లేనట్లు కనిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న తర్వాత పరిస్థితి మరింతగా దిగజారినట్లు కనిపిస్తోంది. ఇక ముందు కూడా చంద్రబాబు పార్టీ నాయకులను అదుపు చేయగలుగుతారా అనేది సందేహంగానే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+