చంద్రబాబుకు తెలియదు: బాక్సైట్ తవ్వకాల జీవోపై కెఈ సంచలనం
విజయవాడ: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేశారు. బాక్సైట్ జీవో గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, సంబంధిత మంత్రికి తెలియదని ఆయన అన్నారు.
ఈ జీవో విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ముఖ్యమైన జీవోల విషయంలో అధికారులు సమాచారం ఇవ్వాలని కోరారు. అభివృద్ధిలో ఉత్తరాంధ్ర, రాయలసీమపై తాము వివక్ష చూపడం లేదన్నారు.
బుధవారం జరగనున్న రాయలసీమ జేఏసీ భేటీకి తాను హాజరుకానని చెప్పారు. కరవు మండలాలలపై రీ సర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీ భూమి- మీ ఇంటికి మంచి స్పందన వస్తోందన్నారు. డిసెంబరు చివరి నాటికి ఫిర్యాదులు పరిష్కరిస్తామని కేఈ వివరించారు.

ఇదిలావుంటే, బాక్సైట్ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. తాత్కాలికంగా నిలిపి మళ్లీ తవ్వకాలు జరపాలని చూస్తే గిరిజనులు చంద్రబాబు గుండెల్లో నిద్ర పోతారని ఆయన సోమవారం విశాఖపట్నంలో అన్నారు.
సేవారంగంలో ఎఫ్‌డీఐలను అనుమతిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్ణాభిన్నమవుతుందన్నారు. బీజేపీ వ్యతిరేకతకు బీహార్ ఫలితాలే నిదర్శనమన్నారు. ఏపీ ప్రజలపై సానుభూతి వద్దని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని నారాయణ డిమాండు చేశారు.












Click it and Unblock the Notifications