Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెవెన్యూశాఖపై చంద్రబాబు కీలక నిర్ణయాలు-పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల పోర్టల్, పేదల ఇళ్లపై..!

ఏపీలో రెవెన్యూశాఖపై ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు పట్టాదారు పాసుపుస్తకాలు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, భూముల రీసర్వే, భూములకు ప్రత్యేక పోర్టల్, ఫ్రీహోల్డ్ భూములు వంటి అంశాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. పనిలో పనిగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మంత్రుల కమిటీకి సూచనలు ఇచ్చారు.

అక్టోబర్ కల్లా కుల ధృవపత్రాలు

అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటిపరకూ 43.89 లక్షల మందికి కుల ధ్రువీకరణ ప్రతాలు ఇచ్చిందని, మిగిలిన వారికి కూడా వీటిని ఇవ్వాలని సూచించారు. ఒకసారి ధృవీకరణ పత్రం పొందితే, వారి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్ గా ఆ డాటా ఆధారంగా కుల ధృవీకరణ పత్రం వచ్చేలా చూడాలన్నారు. ఎస్సీలకు స్మశాన వాటికల స్థలాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వీటి భూసేకరణ కోసం రూ. 137 కోట్లు అవసరమని తేల్చారు. వచ్చే రెండు మూడేళ్లలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు.

Chandrababu regime to issue pattadar passbooks from aug minsters committee on house sites to poor

రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం గ్రాంట్స్ కింద ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంలో న్యాయ సలహాలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇల్లు, ఇంటి స్థలం లేని వాళ్లు ఉండకూడదన్నారు. రెండేళ్లలో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. అలాగే మరో రెండేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అంటే వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.

పేదలకు ఇళ్ల స్ధలాలు

ఇళ్ల స్థలాలకు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 99,390 మంది దరఖాస్తు చేశారని, వీటి కోసం 2,051 ఎకరాలు అవసరమని గుర్తించారు. మ్యానిఫెస్టో ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్ల కోసం భూ సేకరణ చేసి ఇద్దామన్నారు. అర్బన్ లో టిడ్కో ఇళ్లు ఇస్తామని, రూరల్ లో మూడు సెంట్ల తో స్థలాలు ఇద్దామని తెలిపారు. దీనిపై క్యాబినెట్ రెవెన్యూ, హౌసింగ్, మునిసిపల్ మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేద్దామన్నారు.

Chandrababu regime to issue pattadar passbooks from aug minsters committee on house sites to poor

ఆగస్టులో పట్టాదారు పాసు పుస్తకాలు

భూముల రీసర్వే పూర్తయిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నాటికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ముద్రించిన 21.86 లక్షల మందికి తొలివిడతగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలన్నారు. ప్రతి పట్టా దారు పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్ తో పాటు, ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి భూ యజమాని తమ భూమి వివరాలు వ్యక్తి గతంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఆధార్ కార్డు తో సమగ్ర భూ వివరాలు రావాలన్నారు. తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలన్నారు. అలగే విధంగా ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలు, పాలసీలకు బట్టి అన్ని ఉత్తర్వులతో కలిపి కొత్త రెవెన్యూ మాన్యువల్ ఆగస్టు నాటికి తేవాలన్నారు.

అనధికార నివాసాల క్రమబద్ధీకరణ, వారసత్వ భూములు

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అనధికారికంగా ఉంటున్న అభ్యంతరం లేని ప్రాంతాల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ లోపు ఈ తరహా అన్ని దరఖాస్తులు పరిశీలించి రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ లో 56 సర్వీసులు ఉన్నాయని, వాడుకలో లేని సర్వీసులను తొలగించాలన్నారు. వారసత్వంగా వచ్చే భూములును పంచుకునే విషయంలో రూ.100 చెల్లించి సక్సెషన్ చేసుకోవచ్చన్నారు. ఆ భూమి విలువ రూ. 10 లక్షల విలువైన ల్యాండ్ అయితే రూ.100, ఆ పైన విలువైన ల్యాండ్ అయితే రూ.1000 చెల్లించి సక్సెషన్ చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సిబ్బందికి అవసరమైన అధికారాలు ఇవ్వాలన్నారు.

డిసెంబర్ 2027 కల్లా రీసర్వే పూర్తి

డిసెంబర్ 2027 నాటికి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రీ సర్వే 100 శాతం పూర్తి చేయాలన్నారు. రీ సర్వే పూర్తి అయ్యేవరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేయర్లను యథావిధిగా కొనసాగించాలన్నారు. ప్రతి మూడు నెలలకు దీనిపై సమీక్ష చేస్తామని, అదే విధంగా నాలా చట్టం రద్దుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసి క్యాబినెట్ ముందుకు తీసుకురావాలన్నారు. రెవెన్యూ అధికారులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని, దీని వల్ల కూడా సేవల విషయంలో పూర్తి స్థాయి ఫలితాలు రావడం లేదని అధికారులు తెలపగా... రెవెన్యూ అధికారులకు ప్రోటోకాల్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ తీసుకువస్తున్న కొత్త పోర్టల్ గురించి రివ్యూలో అధికారులు సిఎంకు వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+