దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్: పది నిమిషాలు లేట్

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించిన హెలికాప్టర్‌ సోమవారం సాయంత్రం దారి తప్పింది. కర్నూలు నుంచి సోమవారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన హెలికాప్టర్‌ 30 నిమిషాల్లో కడపకు చేరుకోవాల్సి ఉండగా పది నిమిషాలు ఆలస్యంగా కడప చేరుకుంది. ఈ విషయాన్ని కడప విమానాశ్రయంలో స్వయంగా చంద్రబాబు మీడియా ప్రతినిధులకు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు రూ.3300 కోట్లతో 6 స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నటు చంద్రబాబు ప్రకటించారు. సోమవారం ఆయన కర్నూలులో రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో కర్నూలు అల్ర్టా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టుకు, ఓర్వకల్లు మండలంలోని పుడిచర్లలో పరిశ్రమల హబ్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన గొర్రెలు, మేకల పెంపకందారుల రుణాలను మాఫీ చేస్తామన్నారు. బుడగ జంగాల సమస్యపై కమిషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Chandrababu's helicaptor misses route in Andhra Pradesh

రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నది తన సంకల్పమని, కర్నూలు జిల్లాను తయారీ కేంద్రం (మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌)గా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా తంగడంచెలో అంబూజా సం స్థ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను, జైన్‌ ఇరిగేషన్‌ పరిశ్రమ ఏర్పాటు అవుతాయని చెప్పారు.

వీటి ఏర్పాటుతో రాయలసీమ రైతులందరికీ ఊరట లభిస్తుందన్నారు. రూ.400 కోట్లతో పరిశ్రమలకు మౌలికవసతులు కల్పిస్తామన్నారు. ఈ పరిశ్రమల వల్ల 18వేల మందికి ప్రత్యక్షంగా, 30వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+