బాబు టి ఫైర్: ఘుమఘుమలాడించిన లేడీస్ (పిక్చర్స్)
చిత్తూరు/హైదరాబాద్: విభజన నిర్ణయం హేతుబద్దంగా లేదని, తమ పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెసు పార్టీ విభజనను తెర పైకి తీసుకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. సంక్రాంతి పండుగ కోసం చంద్రబాబు నారావారిపల్లికి వెళ్తూ చిత్తూరు జిల్లా తుమ్లగుంటలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుల పైన ధ్వజమెత్తారు.
టిడిపిని దెబ్బతీసేందుకే కాంగ్రెసు విభజన నిర్ణయం తీసుకుందన్నారు. నిర్ణయం హేతుబద్దంగా లేదన్నారు. సీమాంధ్రలో పరిష్కారం చూపించిన తర్వాత విభజన చేయాలని చెబుతున్నానని అన్నారు. విభజన కోసం ఆర్టికల్ 3ను సూచించింది జగనే అని, తెలంగాణలో కనీసం కార్యకర్తలు లేని ఆ పార్టీ ముప్పై సీట్లు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించి కెసిఆర్ ఫాంహౌస్‌లో పోగేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ పద్ధతి లేని వ్యక్తి అన్నారు.
దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీ దోచుకుందని, సోనియా అవినీతి అనకొండ అన్నారు. ప్రజలు తిరుగుబాటు చేసే దశకు వచ్చారని, కొందరు కాంగ్రెసు, జగన్ పార్టీ నేతలు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న ఈ దుర్మార్గులను ఈ వెంకటేశ్వర స్వామి భరించడని, ఆయన బుద్ధి చెబుతాడన్నారు. అత్యంత అవినీతిపరుడు జైలు నుండి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా అని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. తండ్రి అధికారం అడ్డు పెట్టుకొని భారీగా సంపాదించాడన్నారు. టిడిపి నీతివంతమైన పాలన అందించిందన్నారు.
ప్రస్తుత రాజకీయాలు కలుషితమయ్యాయని, డబ్బు, మందు, రౌడీయిజం రాజకీయాల్లోకి వచ్చిందన్నారు. తనకు ఎలాంటి కోరికలు, ఆలోచనలు లేవన్నారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడపడమే తన లక్ష్యమన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని కాపాడుకోవాల్సి ఉందన్నారు. పలు హామీలు గుప్పించిన చంద్రబాబు, అవి అసాధ్యమైనవి కాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. మనం గతంలో చేసిన కార్యక్రమాలు ఇప్పుడు మోడీ, కేజ్రీవాల్ చేస్తున్నారన్నారు.
కాగా, ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

నారా చంద్రబాబు నాయుడు
విభజన నిర్ణయం హేతుబద్దంగా లేదని, తమ పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెసు పార్టీ విభజనను తెర పైకి తీసుకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. సంక్రాంతి పండుగ కోసం చంద్రబాబు నారావారిపల్లికి వెళ్తూ చిత్తూరు జిల్లా తుమ్లగుంటలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు.

టిడిపి 1
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకలు ఉల్లాసంగా జరుపుకుంటున్న మహిళా నేతలు.

టిడిపి 2
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా లంబాడీలతో కలిసి నృత్యం చేస్తున్న నేతలు.

టిడిపి 3
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకల్లో నృత్యం చేస్తున్న లంబాడీ మహిళల దృశ్యం.

టిడిపి 4
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా లంబాడీలతో కలిసి నృత్యం చేస్తున్న నేతలు.

టిడిపి 5
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకలు ఉల్లాసంగా జరుపుకుంటున్న మహిళా నేతలు.

టిడిపి 6
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకలలో భాగంగా పిండి వంటలు చేస్తున్న మహిళా నేతలు.

టిడిపి 7
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకలలో భాగంగా పిండి వంటలు చేస్తున్న మహిళా నేతలు.

టిడిపి 8
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సంక్రాంతి వేడుకలలో భాగంగా భవనం ముందు ముగ్గు వేసిన దృశ్యం.












Click it and Unblock the Notifications