చంద్రబాబు మంచి రాజధాని నిర్మిస్తారు: కెటిఆర్

తమది బిజినెస్ ఫ్రెండ్లీ సర్కారు అని తెలిపారు. తెలంగాణ బిల్డర్ల సమాఖ్య(టీబీఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమాఖ్య రిజిస్ట్రేషన్ బాండ్‌ను ఆవిష్కరించారు. ఇది సంధికాలమని, విభజన నేపథ్యంలో ఏమవుతుందో అన్న ఆందోళన బిల్డర్లతో పాటు తమకూ ఉందని ఆయన అన్నారు. కొత్తగా పెళ్లయినప్పటి మనఃస్థితి ఇదని, అయితే కొన్ని రోజుల్లో సమస్యలు సద్దుమణుగుతాయని కెటిఆర్ అన్నారు.
మునుపటి కంటే పది రెట్ల అభివృద్ధిని, అంతకంటే ఎక్కువ స్వేచ్ఛని హైదరాబాద్ అనుభవిస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లు కొనుక్కోవాలనుకుంటే మూడు నెలల్లో ఆ పని చేయాలని, ఆ తరువాత కొనాలన్నా దొరకవని వ్యాఖ్యానించారు. ప్రణాళికాబద్ధంగా రాజధానిని విస్తరిస్తామని, అడ్డగోలు అనుమతుల వల్ల ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వంలో పట్ణణాభివృద్ధి, పురపాలక శాఖలే కీలకమని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే 'హైదరాబాద్ సిర్ఫ్ హమారా' నినాదం ఇచ్చామని, కానీ, రాజధాని అందరిదని, ఇది విశ్వనగరమని చెప్పారు. తెలంగాణలోని ఐదు జిల్లాలకు విస్తరించిన హైదరాబాద్ అభివృద్ధి చెందితే సగం రాష్ట్రం వెలిగిపోయినట్టేనని వివరించారు.
కావేరి జలాలపై కర్ణాటక-తమిళనాడుల మధ్య గొడవ జరుగుతున్నట్లే, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల మధ్య పోలవరం వివాదం కానుందని చెప్పారు. అయితే, ఈ సమస్య ప్రభుత్వాలకే పరిమితమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications