Chandrababu: చంద్రబాబుకు బెయిల్ వచ్చేనా.. నేడు హైకోర్టులో సాగనున్న వాదనలు..

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ చంద్రబాబును అరెస్ట చేసిన సంగతి తెలిసిందే. అప్పటు నుంచి ఆయన న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆయన మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

హైకోర్టులో చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఏ ప్రకారం పిటిషనర్‌ (పబ్లిక్‌ సర్వెంట్‌)పై కేసు పెట్టాలన్నా, దర్యాప్తు చేయాలన్నా గవర్నర్‌ నుంచి ముందస్తు ఆమోదం తప్పనిసరని గుర్తు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతించాలని కోరారు. హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ పై బుధవారం వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు బెయిల్ పై ఏపీ హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Chandrababus bail will be heard by the Andhra Pradesh High Court on Wednesday

మరోవైపు చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలుకు చంద్రబాబు తరపున న్యాయవాదులను ఆదేశఇంచింది. అంతకుముందు చంద్రబాబు వేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. కరుడుగట్టిన నేరస్థులు అదే జైలులో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

చంద్రబాబు జైలులో పూర్తి స్థాయి భద్రత కల్పించినట్లు సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వివరించారు. జైలులో పోలీసులు 24 గంటలు విధుల్లోనే ఉంటున్నారని గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టివేసింది. కుంభకోణలో తన పాత్ర లేదని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని అరెస్ట్ చేసినట్లు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+