పొత్తుల్లో బిగ్ ట్విస్ట్, పవన్ కు బీజేపీ బంపరాఫర్- చంద్రబాబు చేయలేనిది..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది. అటు ఎన్డీఏ భేటీతో విపక్షాలకు కౌంటర్ ఇస్తోంది. ఏపీలోనూ అనూహ్య నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పవన్ ను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించిన బీజేపీ...జనసేనానికి బంపరాఫర్ ఇచ్చేందుకు సిద్దమైంది. దీంతో, ఇప్పుడు పవన్ కల్యాణ్ నిర్ణయం కీలకం కానుంది. ఈ దశలో ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
మూడు పార్టీలు కలుస్తాయా:

పవన్ ను బీజేపీ ఫిక్స్ చేస్తోందా:టీడీపీతో కలిసేందుకు బీజేపీ సుముఖంగా లేకపోతే, పవన్ టీడీపీ వైపే మొగ్గు చూపుతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా ఏపీలో టీడీపీ స్థానంలో తాము ఎదగాలనేది బీజేపీ నేతల ఆకాంక్ష. దీంతో, పవన్ ను టీడీపీ వైపు వెళ్లకుండా చూసే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే బీజేపీ - జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ ను ప్రకటించేందుకు రంగం సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీతో పొత్తుకు పవన్ వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రకటన ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. టీడీపీతో జనసేన కలిసి వెళ్లినా..ఆ రెండు పార్టీల పొత్తులో పవన్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉండదు. అందుకు చంద్రబాబు అంగీకరించరని బీజేపీ నేతల అంచనా.
పవన్ నిర్ణయమే కీలకం:దీంతో, చంద్రబాబు చేయలేనిది తాము చేయటం ద్వారా పై చేయి సాధించాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ అభిమానులు..జనసైనికులు జనసేనాని సీఎం కావాలని కోరుకుంటు న్నారు. ఇదే సమయంలో చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలో పవన్ ను తమ కూటమి సీఎం అభ్యర్ధిగా ప్రకటించటం ద్వారా ఎన్నికల్లో సమీకరణాలు మారుతాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ ఆఫర్ ఇచ్చినా పవన్ ఏం చేస్తారనేది కీలకం. బీజేపీ, టీడీపీతో కలిస్తేనే అధికారం సాధ్యమని పవన్ నమ్మతున్నారు. ఈ దశలో బీజేపీ..టీడీపీ మధ్య గ్యాప్ భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారని చెబతున్నారు. ఈ సమయంలోనే పవన్ ను తమ ఆఫర్ తో బీజేపీ ఫీక్స్ చేస్తోంది. దీంతో పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications