కొత్తపార్టీ వచ్చినా: సిఎం పార్టీపై బొత్స, చాలా చేశా: కిరణ్

Changes are common before elections: Botsa
విజయనగరం/హైదరాబాద్: ప్రజాబలంలేని వారే పార్టీలు మారుతారని, కొత్త పార్టీలు పుట్టుకు వచ్చినా కాంగ్రెసు పార్టీకి ఢోకాలేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆదివారం విజయనగరం జిల్లాలో అన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త పార్టీలు పుట్టుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఎన్ని పార్టీలొచ్చినా కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీపై విలేఖరులు ప్రశ్నించగా, బొత్స పై విధంగా స్పందించారు. సీమాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రజల మనోభావాలకు కట్టుబడి తాను సమైక్యతను కోరుకుంటున్నానన్నారు. విభజన బిల్లుపై శాసనసభలో ఓటింగ్ జరిగితే పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా వ్యతిరేకించాలని కోరారు. ప్రతిపక్షాలు సమావేశాల్లో ఒకలా, బయటకు వచ్చి మరోలా మాట్లాడుతున్నాయన్నారు.

ప్రజాబలం లేనివారే పార్టీలు మారుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి మార్పులు జరుగుతుంటాయన్నారు. పార్టీలు మారినంత మాత్రాన ఎన్నికల్లో గెలుపొందలేరని, వారికి ప్రజలు ఓట్లు వేయరని చెప్పారు. గతం కంటే ఈసారి ఎక్కువ వలసలు ఉన్నాయని, సీమాంధ్ర కాంగ్రెసు ఎమ్మెల్యేలు, మంత్రులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నందున రాష్ట్రం విడిపోదని భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెసు ఖాళీ అవుతుందనేది అపోహ మాత్రమే అన్నారు.

చాలా చేశా: కిరణ్

మూడేళ్ల కాలంలో తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే నాటికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తొమ్మిదివేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని అన్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని పరిస్థితిని చక్కదిద్దగలిగినట్టు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, పారిశ్రామిక రంగంతో పాటు, వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+