ముద్రగడకు చార్మీ దెబ్బ?: బర్నింగ్ ఇష్యూ ముందు ఆ ఇష్యూ 'సైడ్' అయింది!

ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4.30గం. వరకు మీడియా కథనాలన్నీ ఛార్మీ చుట్టే తిరిగాయి.

హైదరాబాద్: బర్నింగ్ ఇష్యూల వెంట పరిగెత్తడం మీడియాకు కామన్. టీఆర్పీలు రావాలంటే వివాదాల్లోకి కెమెరాలు దూర్చాల్సిందే. విషయం గ్లామర్ ఫీల్డ్‌కు సంబంధించిందైతే.. నిమిషానికొక బ్రేకింగ్ లెక్కన వీక్షకుల్ని టీవిలకు కట్టిపడేయాల్సిందే.

ఈ బ్రేకింగ్ న్యూస్‌ను బ్రేక్ చేసుకుని మరో వార్త మీడియాలో హైలైట్ అవాలంటే.. అంతకుమించిన హైడ్రామా ఏదో రక్తి కట్టాలి. ఇంతా జరిగినా.. గ్లామర్ ఫీల్డ్ ఇష్యూలో అవతలి ఇష్యూస్ కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. బుధవారం రోజు మీడియా తెర మీద చార్మి చుట్టూ రక్తి కట్టిన ఇష్యూలో.. ముద్రగడ పాదయాత్రకు ఫోకసే కరువైంది.

charmy effect on mudragada padmanabham padayatra

ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4.30గం. వరకు మీడియా కథనాలన్నీ ఛార్మీ చుట్టే తిరిగాయి. దీంతో ముద్రగడ పాదయాత్ర ఇష్యూకు రావాల్సినంత ఫోకస్ రాలేదు. ప్రతీ బులెటిన్ లో ఏదో 20-30సెకన్ల వార్తతో ముద్రగడ పాదయాత్రను మమా అనిపించింది మీడియా. వందల మంది పోలీసులు ఆయన ఇంటి చుట్టూ మోహరించినా.. డ్రగ్స్ కేసు ముందు మీడియాకు అది హైలైట్‌గా కనిపించలేదు.

మీడియా ఫోకస్ మిస్సవడంతో ముద్రగడ ప్లాన్ విఫలమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో ఇటు జనంలోను పాదయాత్రకు సంబంధించి పెద్దగా చర్చ కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయన పాదయాత్రకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఛార్మీ విచారణ ఎఫెక్ట్ ముద్రగడ పాదయాత్ర మీద ఇలా ప్రభావం చూపించిందన్నమాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+