ఒక్కరు రాలేదు, చేదు అనుభవం: చిరుకు కోపమొచ్చి...
ప్రకాశం: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార సమితి చీఫ్ చిరంజీవికి మంగళవారం కోపమొచ్చింది. ఆయనకు ప్రకాశం జిల్లా ఒంగోలులో చేదు అనుభవం ఎదురయింది. ప్రచారం నిమిత్తం ఒంగోలుకు వచ్చిన చిరంజీవి స్థానిక పల్లవ అతిథి గృహంలో సోమవారం రాత్రి బస చేశారు.
ఆక్కడ ఆయన అభిమానులు మినహా దాదాపు కాంగ్రెసు నేతలు ఎవరు లేరు. సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయనతో కాంగ్రెసు నాయకులు ఎవరు లేరట. దీంతో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి.. చిరును ఒంగోలుకు తీసుకు వచ్చి అతిథి గృహంలో విడిది చేయించారు.

జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉండగా కేవలం ఏడుగురు అభ్యర్థులే చిరును కలిశారు. దీంతో ఆయన అలిగారు. ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంగోలు లోకసభ అభ్యర్థి పవన్ కుమార్ కూడా రాలేదు. పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే అభ్యర్థి స్థానికంగా లేకపోవటాన్ని చిరంజీవి ప్రస్తావించారు. దీంతో మనస్థాపం చెంది.. మంగళవారం ఒంగోలులోని గద్దలగుంటలో రోడ్డుషో నిర్వహించాల్సి ఉన్నా రద్దు చేసుకున్నారు. వందమందిని తెచ్చుకోలేని వారికి టిక్కెట్లా అంటూ సొంత పార్టీ అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోపంలో అభిమానులు తెచ్చిన పూలదండాను కేవలం చేతితో తాకి వెళ్లిపోయారట.












Click it and Unblock the Notifications