వాస్తు ప్రకారం చిరు ఇంటికి మార్పు, చరణ్ ట్రిప్ అందుకే!
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిరంజీవి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి మరమ్మతులు చేయించనున్నారని తెలుస్తోంది. సమాచారం మేరకు.. వాస్తు నిపుణుల సూచన మేరకు చిరంజీవి తన ఇంటికి మరమ్మతులు చేయించనున్నారని తెలుస్తోంది.
చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, భార్య ఉపాసనలు ప్రస్తుతం యూకేలో ఉన్నారు. అక్టోబర్ 14వ తేదీన వారు తిరిగి హైదరాబాదుకు రానున్నారు. ఇంటికి పెద్ద మరమ్మతులు చేయనున్నందునే వారు ఈ ట్రిప్ ప్లాన్ చేశారని అంటున్నారు. అలాగే, గోవిందుడు అందరివాడే చిత్రం అనంతరం రామ్ చరణ్ తేజ కూడా బ్రేక్ తీసుకోవాలనుకున్నారని చెబుతున్నారు.

కాగా, మన దేశాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో భాగంగం కావాల్సిందిగా నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
ఇప్పటికే ప్రముఖ సినీ స్టార్స్ కమల్ హాసన్, అమీర్ ఖాన్, సూర్య వంటి వారు ఈ స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు తమ మద్దతు ప్రకటించగా... ఇపుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన మద్దతు ప్రకటించారు.
ఈ మేరకు చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. శుభ్రతగా ఉండటం దైవభక్తితో సమానంమని, మనం శుభ్రత పాటించకపోతే భగవంతుని ఆశీసులు లభించవని గాంధీజీ అన్నారని, గాంధీజీ స్ఫూర్తితో ప్రధాని స్వచ్చ భారత్ కి పిలుపునిచ్చారంటూ ఆ వీడియో చిరంజీవి తెలియజేశారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications