చంద్రబాబు చేరికల వ్యూహం: జగన్ పార్టీపై దెబ్బ, బిజెపికి చెక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తునట్లు కనిపిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బ తీయడం, బిజెపి ఎదుగుదలను నిలువరించడం కూడా ఆయన వ్యూహంలో భాగంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
వివిధ జిల్లాల్లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను, బిజెపిలో చేరాలని ప్రయత్నిస్తున్న నాయకులను ఆయన చేరదీస్తూ పార్టీ కండువా కప్పుతున్నారు. ఈ చేరికల విషయంలో ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులకు నచ్చజెప్పే వ్యూహాన్ని కూడా ఆయన అనుసరిస్తున్నారు. ఈ వ్యవహారం అనంతపురం జిల్లాలో ఎన్నికల ముందు జెసి బ్రదర్స్‌ను చేర్చుకోవడంతో ప్రారంభమైందని చెప్పాలి.
ప్రస్తుత మంత్రి పరిటాల సునీత వర్గానికి, జెసి సోదరులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అటువంటి స్థితిలోనూ ఆయన పరిటాల సునీతకు నచ్చజెప్పి జెసి దివాకర్ రెడ్డిని, జెసి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా బుధవారంనాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులను పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి టిడిపిలో చేరారు.
నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి కొంత మంది నాయకులకు, పార్టీలోని ఓ వర్గానికి ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఆనం సోదరులను పార్టీలోకి రప్పించుకున్నారు. ఇదే తరహాలో కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవాలనే ఆలోచనను జమ్మలమడుగు టిడిపి ఇంచార్జీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, రామసుబ్బారెడ్డిని కాదనకుండానే ఆయనకు నచ్చజెప్పడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. రామసుబ్బారెడ్డి అంగీకరించే వరకు వేచి చూసే ధోరణిని చంద్రబాబు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక, తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ నాయకుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రముఖ అనుచరుడు కొణతాల రామకృష్ణను కూడా పార్టీలోకి తీసుకునేందుకు ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు కొణతాల రామకృష్ణ దగ్గరయ్యే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.

అనకాపల్లిలోని అతి పురాతనమైన ఎఎంఎఎల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి కొణతాల రామకృష్ణ చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పార్టీలో చేరే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొణతాలను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అయితే, మంత్రి గంటా శ్రీనివాస రావు కొణతాల రామకృష్ణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని గంటా వర్గీయులు సమావేశమై తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. మరో మంత్రి అయన్న పాత్రుడు ఈ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. విశాఖఫట్నం జిల్లాలో అయన్నపాత్రుడికి, గంటా శ్రీనివాస రావుకు మధ్య ప్రఛ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఈ స్థితిలో కొణతాల రామకృష్ణను పార్టీలోకి ఆహ్వానించడానికి అయన్నపాత్రుడు సిద్ధపడినట్లు చెబుతున్నారు.
మరోవైపు, టిడిపి నుంచి వైయస్సార్ కాంగ్రెసులో చేరి, ఆ పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు కూడా టిడిపి వైపు చూస్తున్నారు. దాడి వీరభద్ర రావు వర్గానికి, కొణతాల వర్గానికి మధ్య విభేదాలున్నాయి. ఈ స్థితిలో దాడి వీరభద్రరావు విషయంలో చంద్రబాబు ఏ విధమైన వైఖరి తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. విశాఖపట్నం రాజకీయాల చిక్కు ముడులను విప్పాలని చంద్రబాబు పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకటరావుకు సూచించినట్లు తెలుస్తోంది.
మొత్తంగా చంద్రబాబు ఎవరినీ నొప్పించకుండా, ఎవరినీ తక్కువ చేయకుండా జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతలను టిడిపిలోకి చేర్చుకునే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications