కేసులో ఉచ్చులో టీడీపీ, నెక్స్ట్ టార్గెట్ - ఎన్నికల ఫలితం మారేనా..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారింది. టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం వైసీపీ అమలు చేస్తోంది. తాజా పరిణామాలతో సానుభూతి పొందే ప్రయత్నాలు టీడీపీ ముమ్మరం చేస్తోంది. ఏపీలో పరిణామాలు బీజేపీ నిశితంగా గమనిస్తోంది. పవన్ కల్యాణ్ పాత్ర కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలపైన పెండింగ్ లో ఉన్న కేసులు తెర మీదకు వస్తున్నాయి. జమిలి ఎన్నికల ప్రచారం వేళ ఈ కేసులు.. అరెస్ట్ లు ఎవరికి అనుకూలంగా మారుతానేది ఇప్పుడు చర్చ.
మారుతున్న రాజకీయం:ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయం ఒక్క సారిగా కొత్త టర్న్ తీసుకుంది. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో చంద్రబాబు హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ తో పాటుగా బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఈ రోజు హైకోర్టులో వీటి పైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు...అమరావతి భూముల వ్యవహారంలోనూ విచారణ దిశగా సీఐడీ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో, అప్రమత్తమైన చంద్రబాబు తనపేరు ఎఫ్ఐఆర్ లో ఉన్న కేసుల్లో బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక, టీడీపీ నేతల పైన ఉన్న కేసుల వ్యవహారం తెర మీదకు వస్తోంది.

కేసుల ఉచ్చులో టీడీపీ:చంద్రబాబు తో పాటుగా పలువురు టీడీపీ ముఖ్య నేతల పైనా కేసులు ఉన్నాయి. దీంతో, టీడీపీలో అలజడి మొదలైంది. పైకి కేసులు..జైలుకు సిద్దమని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా...లోలోపల మాత్రం ఎన్నికల వేళ కేసుల్లో చిక్కుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయనే ఆందోళన కనిపిస్తోంది. ముఖ్య నేతలు కోర్టుల చుట్టూ తిరిగితే ఆర్దికంగా.. రాజకీయంగా నష్టం ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఎన్నికల సంసిద్దత సమయం లో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం ఫలిస్తే తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో వరుస కేసులు..అవినీతి ఆరోపణలు పొత్తులపైనా ప్రభావం చూపుతాయనే వాదన ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ హాయంలో దాఖలైన కేసులను సీరియస్ గా తీసుకోని చంద్రబాబు..ఇప్పుడు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నారు.
కలిసొచ్చేదెవరికి:అయితే, వచ్చే ఎన్నికల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు ఏపీలో ఆసక్తి కర చర్చ. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ కేడర్ లో సహజంగానే ఆక్రోశం..వైసీపీ కేడర్ లో ఉత్సాహం కనిపిస్తున్నాయి. ఈ అరెస్ట్ తరువాత కూడా టీడీపీ, వైసీపీ మద్దతుగా నిలిచే వారిలో మార్పు ఉండే అవకాశం లేద. కానీ, తటస్థుల మూడ్ కీలకం కానుంది. వీరి మూడ్ తెలుసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెజార్టీ ఓట్ బ్యాంక్ ..పథకాల లబ్ది దారులు ఈ పరిణామాలతో ప్రభావం అయ్యే అవకాశం లేదనేది వైసీపీ అంచనా. చంద్రబాబు అవినీతి చేసారని నిరూపణ చేస్తే ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు. అయితే వరుస కేసులు కంటిన్యూ అవుతే మాత్రం లెక్కలు మారుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు కేసులు - ఎన్నికల నడుమ ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications